అందాల ముద్దుగుమ్మ ఫారియా అబ్దుల్లా గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఈ ముద్దుగుమ్మ నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కె వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో  చిట్టి పాత్రలో నటించిన ఫారియా  అబ్దుల్లా తన పాత్రతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది.  అలా మొదటి సినిమా తోనే తన అందంతో,  నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ పొడుగుకాళ్ల సుందరి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక అవకాశాలు వచ్చినట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి.  

కాక పోతే ఆ సినిమాలు ఏవి చాలా వరకు మొదలు కాలేదు.  కాకపోతే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా  అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో  తెరకెక్కిన బంగార్రాజు సినిమా లో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ లో ఫారియా  అబ్దుల్లా తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది.  అలాగే ప్రస్తుతం ఫారియా అబ్దుల్లా , మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర మూవీ లో  హీరోయిన్ గా నటిస్తోంది.  

ఇది ఇలా ఉంటే  ప్రస్తుతం జాతి రత్నాలు బ్యూటీ  ఫారియా అబ్దుల్లా కు కోలీవుడ్‌ ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చినట్లు ఒక టాక్‌ వినిపిస్తోంది.  బిచ్చగాడు మూవీ తో సన్సేషనల్ సూపర్ హిట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విజయ్ ఆంటోని సరసన నటించే అవకాశాన్ని ఫారియా అబ్దుల్లా దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  విజయ్ ఆంటోని హీరోగా సుసీంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో ఫారియా అబ్దుల్లా కు అవకాశం వచ్చినట్లు ఒక టాక్ తెగ వైరల్ అవుతుంది.  ఈ సినిమాలో ఫారియా అబ్దుల్లా పల్లెటూరి అమ్మాయిల కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: