టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన రామ్ పోతినేని ప్రస్తుతం ది వారియర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తమిళ క్రేజీ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండే చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఇటీవలే ది వారియర్ మూవీ నుండి చిత్ర బృందం బుల్లెట్ సాంగ్ ను విడుదల చేశారు.  రామ్ పోతినేని,  కృతి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది.  శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ సాంగ్ ని కోలీవుడ్ హీరో శింబు - హరి ప్రియ లు పాడారు. ఇప్పటి వరకు ది వారియర్ మూవీ లోని బుల్లెట్ సాంగ్ తెలుగు .. తమిళ భాషల్లో కలిపి  40 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం కూడా ఈ సాంగ్ ఫుల్ స్పీడ్ లో యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా తెలుగు,  తమిళ భాషల్లో జూలై 14 వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది.  రామ్ పోతినేని ఈ మూవీ తో  కోలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నాడు.  ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని,  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: