సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కార్ వారి పాట మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. విడుదల అయిన మొదటి షో నుండి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. ఇప్పటి వరకు 16 రోజుల బాక్సాఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సర్కారు వారి పాట సినిమా కలెక్షన్లు 16 వ రోజు అమాంతం పడిపోయాయి. ఈ సినిమా 16 రోజుల కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం...

 1 వ రోజు : 36.01 కోట్లు
2 వ రోజు : 11.04 కోట్లు
3 వ రోజు : 12.01 కోట్లు
4 వ రోజు : 12.06 కోట్లు
5 వ రోజు : 3.64 కోట్లు
6 వ రోజు : 2.32 కోట్లు
7 వ రోజు : 1.82 కోట్లు
8 వ రోజు : 1.79 కోట్లు
9 వ రోజు : 1.40 కోట్లు
10 వ రోజు : 1.58 కోట్లు
11 వ రోజు : 2.40 కోట్లు
12 వ రోజు : 86 లక్షలు
13 వ రోజు : 50 లక్షలు
14 వ రోజు : 27 లక్షలు
15 వ రోజు : 26 లక్షలు
ఇలా 15 రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసిన తర్వాత ఈ సినిమా 15 వ రోజు కలెక్షన్ లతో పోలిస్తే 16 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లను అతి తక్కువగా రాబట్టింది.



16 వ రోజు సర్కారు వారి పాట సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 లక్షల కలెక్షన్లను మాత్రమే రాబట్టగలిగింది. 16 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట 88.09 కోట్ల షేర్ , 132.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. 16 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా సర్కారు వారి పాట సినిమా 18 లక్షల షేర్లు 40 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 16 రోజులకు గాను సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 107.19 కోట్ల షేర్, 172.40 కోట్ల క్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: