బుల్లితెర యాంకర్ అనసూయ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లు లేదు..వెండితెరపై నటనతో, బుల్లితెరపై అందాలతో ఆకట్టుకుంటుంది. అయితే ఆమె హీరోయిన్‌గానూ నటించింది.కొన్ని సినిమాలు అనుకు మంచి పేరును అందించాయి.మరి కొన్ని సినిమాలు అనుకున్న ఫలితాలను ఇవ్వలేక పోయాయి.అనసూయ అంటే ఆమె యాంకరింగ్‌ మాత్రమే గుర్తుకొస్తుంది. మరోవైపు రంగస్థలం తర్వాత ఆమె నటిగానూ పాపులారిటీని సొంతం చేసుకుంది. కీలక పాత్రలకు అనసూయ కేరాఫ్‌గా నిలుస్తుంది.


బలమైన పాత్రలతోనే ఆకట్టుకుంటున్న ఈ భామ వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటుంది. అటు యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై అందాలు ఆరబోస్తూనే.. ఇటు విభిన్న పాత్రల్లో వెండితెరపై తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో జోరు పెంచింది.పుష్ప చిత్రంలోనూ మంగళం శ్రీను భార్యగా దాక్షాయణి పాత్రలో నటించింది. ఈ పాత్రతో ఇక అనసూయ పాపులారిటీ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటింది. అదే జోష్ తో ఆమె వరుస సినిమాలను ప్రకటిస్తూ షాకిస్తోంది. మున్ముందు కూడా ఈ బ్యూటీ ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపించేలా ప్లాన్ చేసుకుంది. అటు 'ఎక్స్ ట్రా జబర్దస్త్' యాంకర్ గానూ కొనసాగుతున్న అనసూయ స్మాల్ స్క్రీన్ పై, వెండితెరపై అందాలు ఆరబోస్తోంది. ముఖ్యంగా ఈ బ్యూటీ జబర్దస్త్ షోకోసం ప్రతి వారం లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తుంటుంది.ఆ షో లో ఆమె వేసే డ్రెస్సుల పై కొందరు కామెంట్లు చెస్తున్నారు.


తాజాగా టాలీవుడ్ సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ కూడా కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అనసూయ గురించి మాట్లాడుతూ.. అనసూయ డ్రెసింగ్ సెన్స్ అంటే తన చాలా ఇష్టమని, ఆమె ఫ్యాషన్ సెన్స్ కొత్తగా ఉంటుందని తెలిపారు. ట్రెండీగా ఉండే అనసూయ వస్త్రాధరణ ఆయనకు నచ్చుతుందన్నారు. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో ఆకట్టుకుందన్నారు. మొన్నటి 'పుష్ఫ'లోనూ దాక్షయణిగా నటనా ప్రతిభను చూపించిందని తెలిపారు. మున్ముందు అనసూయకు మరిన్ని మంచి పాత్రలు దక్కుతాయని అభిప్రాయపడ్డారు. అనసూయను పొగుడుతూ ఆయన అన్న కామెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: