నందమూరి బాలకృష్ణ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు హిందూపూర్ mla గా ఉంటూ బసవతారక హాస్పటల్ కి సంబంధించి కీలక బాధ్యతలను కూడా చేపడుతూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య హోస్ట్గా కూడా మారారు. అదే ఆన్ స్టాపబుల్. అనే టాక్ షో దేశమంతా బాగా పాపులర్ అయింది ఇది ఆహా లో ప్రసారమవుతుంది. దీంతో బాలయ్య పేరు కూడా దేశమంత వినిపిస్తోంది. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాలయ్య పారితోషకం పెంచరనే టాక్ ఇండస్ట్రీలో ఉన్నది.

ఇక తన తండ్రి నందమూరి తారకరామారావు దర్శక నిర్మాతలకు అందుబాటులో ఎలా ఉంటారు అలా బాలకృష్ణ కూడా ఉంటూ పారితోషికం విషయంలో డిమాండ్ చేయలేదని సమాచారం. ఈ విషయాన్ని కూడా బాలకృష్ణ ఎన్నోసార్లు తెలియజేశారు. ఇదంతా ఇలా ఉండగా ఆహార విషయంలో కూడా ఆయన అదే చేశారని చెప్పవచ్చు.అన్ స్టాపబుల్  మొత్తం 10 ఎపిసోడ్ లు ఉండగా ఇది ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎందుకు బాలయ్య పారితోషికం కేవలం కోటి రూపాయలు మాత్రమే అన్నట్లుగా ఇన్ సైడ్ టాక్ తెలుస్తోంది.


అయితే బాలయ్య మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్కు పారితోషకం పెంచుతారనే సమాచారం. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో ఎపిసోడ్ కు బాలయ్య రూ.25 లక్షల రూపాయల వరకు అందుకోబోతున్నట్లు సమాచారం ఈసారి ఎన్ని ఎపిసోడ్లు ఉండబోతున్నాయి అనే విషయం ఎవరికీ తెలియదు. ఒకవేళ 10 ఎపిసోడ్ లు ఉంటే దాదాపుగా వీటికి రూ.2.5 కోట్ల రూపాయలు అందుకో పోతున్నట్లుగా సమాచారం. మరి ఈ విషయంపై ఆహా నిర్వాహకులు ఎలాంటి క్లారిటీ ఇస్తారో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ చాలా బిజీగా దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా బాలకృష్ణకు ఎవరు సాటిరారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: