సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ సినిమా అంటేనే డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అవుతాయి. తాను అనుకున్న షాట్ పర్ఫెక్ట్ గా అనుకున్న విధంగా వచ్చేందుకు ఎంత బడ్జెట్ అయినా పెట్టేస్తాడు శంకర్. అందుకే ఆయన స్టార్ డైరక్టర్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా ఓ సినిమా వస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 2.ఓ ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో పాటుగా ఇండియన్ 2 మధ్యలో ఆగిపోవడం వల్ల శంకర్సినిమా తో ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

చరణ్ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవట్లేదట శంకర్. అందుకే చిన్న షాట్ కోసం కూడా కోట్ల కొద్దీ బడ్జెట్ కేటాయిస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమాలో చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఏకంగా 3 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట. జస్ట్ ఒక్క షాట్ కోసం అంత బడ్జెట్ అంటే మాములు విషయం కాదు. శంకర్ సినిమా అంటే అనుకున్న బడ్జెట్ కన్నా ఇంకాస్త ఎక్కువ చేతిలో పట్టుకోవాల్సిందే.

దిల్ రాజు ఈ సినిమాను 200 కోట్లతో పూర్తి చేయాలని అనుకున్నారట. చూస్తుంటే ఖచ్చితంగా మరో 50 కోట్లు పట్టేలా ఉంది. శంకర్, చరణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో శ్రీకాంత్, సునీల్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ హిట్ తో పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్ శంకర్ సినిమాతో సత్తా చాటుతాడని చెప్పొచ్చు. ఈ సినిమాలో చరణ్ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారట. సినిమా టైటిల్ కూడా అధికారి అని పెడతారని టాక్. ఆర్.ఆర్.అర్ తర్వాత చరణ్ కి పర్ఫెక్ట్ సినిమా పడ్డదని చెప్పొచ్చు. కెరియర్ లో కొద్దిగా వెనకపడ్డ శంకర్ ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: