తమన్నా హీరోయిన్ గా ఇప్పుడు పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు తమిళ హిందీ భాషలలో మంచి క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అన్ని భాషలలోనూ బిజీగా ముందుకు వెళుతుంది. ఓ టీ టీ లలో కూడా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ విధంగా తెలుగులో ఆమె గతంలో కంటే మంచి అవకాశాలను అందుకోవడం లేదనే చెప్పాలి. మునుపటి స్థాయిలో స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను దక్కించుకోలేక పోతుంది. కెరియర్ పరంగా కొత్త వాళ్లు సినిమా ఇండస్ట్రీలోకి రావడంతో ఈ ముద్దుగుమ్మ హవా తగ్గిందనే చెప్పాలి.
ఐటెం సాంగ్ లు చేసుకుంటూ, గెస్ట్ పాత్రలు చేసుకుంటూ తన కెరియర్ను వెల్లదీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రం తప్ప మరేది లేదు. ఇదే ఆమెకు చెప్పుకోదగ్గ పెద్ద సినిమా.  అలాగే సత్యదేవ్ తో కలిసి నటించిన గుర్తుందా శీతాకాలం అనే సినిమా కూడా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది తెరకెక్కి చాలారోజులు అయిపోయిన ఇంకా విడుదల కాలేదు.  జూన్ 15వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుండగా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సోషల్ మీడియా ఫ్యాన్స్ తో తమన్నా ముచ్చటించింది.

ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విశేషాలను వెల్లడించింది. అంతేకాదు చిరు తో చేస్తున్న భోళా శంకర్ సినిమాకు సంబంధించిన ఒక లీకును కూడా బయటకు చెప్పి అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుంది అని ఎవరూ కూడా డిసప్పాయింట్ అవ్వరని తప్పకుండా ఈ సినిమా తనకు మంచి అవకాశాలను తీసుకువస్తుందని ఆమె వెల్లడించింది. మరి ఈ రెండు సినిమాల తర్వాత ఆమె ఏ స్థాయిలో అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి. సోషల్ మీడియాలో ఆమె హవా వేరే రేంజ్ లో ఉంది. హాట్ హాట్ ఫోటోలతో ఆమె తన అభిమానులను అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: