అందాల ముద్దుగుమ్మ తాప్సీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఝుమ్మంది నాదం మూవీ తో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత తాప్సి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మూవీ లలో హీరోయిన్ గా నటించి తాప్సి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమాల్లో నటిస్తూ వస్తుంది. కొంతకాలం క్రితమే తాప్సీ 'మిషన్ ఇంపాజిబుల్' అనే తెలుగు సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే తాప్సి  తాజాగా భారత మాజీ మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘శభాష్‌ మిథు అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో తాప్సీ టైటిల్ రోల్ లో నటించింది. వయాకామ్‌ 18 సంస్థ ఈ మూవీ ని నిర్మించింది.  ఈ సినిమాను ఈ రోజు అనగా జూలై 15 వ తేదీన విడుదల చేశారు.

ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌ లో జరిగిన విలేకర్ల సమావేశంలో తాప్సీ మాట్లాడుతూ ... క్రికెట్ గురించి నాకు పెద్దగా తెలియదు . నాకు బ్యాట్ పెట్టుకోవడం కూడా రాదు. చిన్న వయసులో బాస్కెట్ బల్ , రేస్ వంటి ఆటలు ఆడాను. క్రికెట్ ఆడలేదు. అందుకే ‘శభాష్‌ మిథు’ మూవీ ప్రాక్టీస్‌ లో చిన్న వయసులో  ఎందుకు క్రికెట్ ఆడలేదా... అని మాత్రం చాలా ఫిల్ అయ్యాను. శభాష్‌ మిథు మూవీ కేవలం క్రికెట్‌ గురించి మాత్రమే కాదు ,  మిథాలీ రాజ్‌ జీవితం గురించి కూడా. అందుకే ఓ సవాల్‌ గా తీసుకుని ఈ మూవీ ని చేశాను. అలాగే మిథాలి జర్నీ నచ్చి ఈ మూవీ ని ఓకే చెప్పాను అని తాజా విలేకరుల సమావేశంలో తాప్సి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: