టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీ 'ది వారియర్' రిలీజ్‌కు ముందర ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే.ఇంకా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, రామ్ తన కెరీర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశారు. తమిళ మాస్ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమాను తెరకెక్కించడంతో 'ది వారియర్' మూవీపై మంచి బజ్ అనేది ఏర్పడింది. ఇక ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూలై 14 వ తేదీన రిలీజ్ చేశారు.కానీ ఈ సినిమా తొలిరోజే మిక్సిడ్ టాక్‌ను తెచ్చుకోవడంతో, ఈ సినిమాను చేసేందుకు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తిని చూపలేదు. ఇక ఓవరాల్‌గా ఈ సినిమా చాలా తక్కువ సమయంలో తన థియేట్రికల్ రన్‌ను ముగించుకుంది.


ఇంకా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన డిస్నీప్లస్ హాట్ స్టార్ 'ది వారియర్' చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను కూడా సొంతం చేసుకుంది. దీంతో ఇక ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ అయిన 28 రోజుల్లోనే ఓటీటీలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.ఇక ది వారియర్ చిత్రాన్ని ఆగస్టు 11 వ తేదీ న డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాలో హీరో రామ్ రెండు విభిన్న లుక్స్‌లో కనిపించగా, అందాల భామ కృతి శెట్టి ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, ఈ సినిమాను ఓటీటీలో ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ అంటోంది. మరి ఓటీటీలో ఈ సినిమాకు ఇక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: