కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన బింబి సారా చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఈ హీరో భారీ విజయాన్ని అందుకోగా కం బ్యాక్ లో రావడమే మంచి భారీ సినిమా తో అయన వచ్చి ఈ విజయాన్ని అందుకున్నారు. నందమూరి అభిమానులలో ఈ విజయోత్సాహం ఎక్కువైంది అని చెప్పొచ్చు. సోషల్ మీడియా లో కూడా నందమూరి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం నిజంగా కొంతమందిని కలవరపరుస్తోంది. సినిమా హిట్ అవడం అనేది పెద్ద విషయమే అయినా దాన్ని ఎక్కువగా చూపించడం నిజంగా హీరో కి ఇబ్బంది గా మారుతుంది అని ఈ ఉదాహరణ ను బట్టి చెప్పొచ్చు.

బింబి సారా సినిమా హిట్ అవడం అందరికి సంతోషాన్ని కలిగించే విషయం. ఎందుకంటే చాలా రోజులుగా ఇండస్ట్రీ కి సరైన హిట్ లేదు. అలాంటి సమయంలో ఈ సినిమా వచ్చి అందరిని అలరించడం అంటే అది మాములు విషయం కాదు. అందులోనూ హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న కళ్యాణ్ రామ్ సినిమా కి ఇంతటి మైలేజ్ రావడం నిజంగా గొప్ప విషయం. అయితే ఈ వచ్చిన హిట్ ను కొంతమంది అతిగా దుర్వినియోగపరుస్తున్నారు కొంతమంది అతి ఉత్సాహం కలిగిన నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్ ను మెగా స్టార్ తో పోల్చడం నిజంగా మితిమీరిన అభిమానం అని చెప్పాలి.

మెగాస్టార్ అని పిలిపించుకోవాలంటే ముందుగా అంతటి స్థాయి కలిగిన సినిమాలను చేయాలి. కళ్యాణ్ రామ్ మెగాస్టార్ కంటే ముందు మంచి నటుడు, మంచి స్వభావం కలిగిన వ్యక్తి. అవన్నీ పక్కనపెట్టి ఆయనను మెగాస్టార్ గా అభివర్ణించడం మెగా అభిమానులనుం కోపం తెప్పిస్తున్న సమయంలోనే కళ్యాణ్ రామ్ పై విమర్శలు వచ్చే చేస్తుంది. హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్న కళ్యాణ్ రామ్ కి ఇది ఒక మచ్చ లాంటిది అని చెప్పొచ్చు ఏకంగా మెగాస్టార్ తో పోల్చడం కొంత ఇబ్బంది గా మారింది. ఇప్పటికైనా నందమూరి అభిమానులు తమ హీరోలకు తలఒంపులు తెచ్చే పనులు కాకుండా కలర్ ఎగరేసే పనులు చేస్తే వారికి మంచి జరుగుతుంది. మరి ఇది ఇప్పటితో ఆగేనా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: