సూపర్ స్టార్ మహేష్‌ బాబు కి ఏమయ్యింది.? టీవీ సీరియళ్ళ ను ప్రమోట్ చేయడమేంటి.? ఇలా నడుస్తోంది సోషల్ మీడియా లో మహేష్ అభిమానుల మధ్య చర్చ.
తమ అభి మాన హీరో బుల్లితెర పై కనిపించడాన్ని.. అదీ సీరియళ్ళ ను ప్రమోట్ చేస్తూ కనిపించడాన్ని అభిమా నులు జీర్ణించుకో లేకపోతున్నారు. అయితే, భారీ ప్యాకేజ్ ఆఫర్ చేసి, సూపర్ స్టార్ మహేష్‌ బాబు ని ఒప్పిం చింది జీ తెలుగు ఛానల్.

అందుకే, ఆ ఛానల్ ద్వారా ప్రసార మ వుతున్న సీరియల్స్‌ ని ప్రమోట్ చేస్తున్నాడు మహేష్‌  బాబు. అంతే నా, ఆ ఛానల్ నిర్వహిస్తోన్న స్పెషల్ ఈవెంట్స్‌ లోనూ సందడి చేస్తున్నాడు. జీ తెలుగు కుటుం బం అవార్డ్స్ వేడుకకి ముఖ్య అతిథి గా.. జీ తెలుగు ఛానల్ నటీ నటు లకు, సాంకే తిక నిపుణుల కు పురస్కారాలు ఇచ్చే కార్యక్ర  మాన్ని 'జీ తెలుగు కుటుంబం అవార్డ్స్' పేరు తో ప్రతి ఏడాది నిర్వ హిస్తుంటారు.

ఈ ఏడాది ఈ ఈవెంట్‌ కి మహేష్‌ బాబు ముఖ్య అతిథి గా హాజరు కానుం డడం గమ నార్హం. మొన్నా మధ్య మహేష్ తన కుమార్తె సితార ని వెంటేసు కుని, జీ తెలుగు ఛానల్ నిర్వహించిన ఓ డాన్స్ ఈవెంట్‌ లో సందడి చేసిన విషయం విదిత మే. ఈసారి జీ కుటుంబం అవార్డ్స్ కదా.. స కుటుంబ సమేతంగా.. మహేష్ వెళతాడా.? ఏమోగానీ, 'వద్దు బాబోయ్..' అంటూ మహేష్ అభిమానులు తమ అభిమాన హీరోని ఉద్దే శించి సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.మహేష్ మాత్రం 'ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' అన్నట్టు గా ముందుకు దూసుకు  పోతు న్నాడు, జీ తెలుగు సీరియల్స్‌  ని ప్రమోట్ చేయడంలో.!

మరింత సమాచారం తెలుసుకోండి: