సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సందడి నెలకొని ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంక్రాంతి పండుగకు సినిమాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో తెలుగు స్టార్ హీరోలు అందుకు తగిన విధంగా షూటింగ్ లను ప్లాన్ చేస్తూ ,  సంక్రాంతి కి సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు.  అలాగే సంక్రాంతి కి విడుదల అయిన సినిమాలు కూడా కాస్త పరవాలేదు అనే టాక్ వచ్చిన కూడా అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లు దక్కుతూ ఉంటాయి. దానితో ఈ సీజన్ లో మూవీ పను విడుదల చేయడానికి దర్శక , నిర్మాతలు మరియు హీరోలు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి కి కూడా బాక్సా ఫీస్ దగ్గర భారీ యుద్ధమే జరిగేలా ఉంది. ఇది ఎలా ఉంటే ఇప్పటికే సంక్రాంతి కి తమ సినిమాలను విడుదల చేయనున్నట్లు కొంత మంది హీరోలు తమ సినిమాల విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించారు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలకు భారీ యుద్ధమే జరిగేలా కనిపిస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తాను నటిస్తున్న మెగా 154 మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

మూవీ కి బాబి దర్శకత్వం వహించగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ సంక్రాంతి పండుగ కే ఈ మూవీ ని కూడా విడుదల చేయాలని మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే ఈ ఇద్దరు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల మధ్య సంక్రాంతి పండుగకు బాక్సా ఫీస్ వద్ద భారీ యుద్ధమే జరిగే అంచనాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: