టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సూపర్‌ హిట్‌ సినిమాల రీ రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మహేష్‌ బాబు ఫ్యాన్స్ ఈ ట్రెండ్‌కి తెరలేపారు.
ఆయన కెరీర్‌ బ్లాక్‌ బస్టర్‌ `పోకిరి` సినిమాని మహేష్‌ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాని భారీగా స్పెషల్‌ స్క్రీనింగ్‌లో ప్రదర్శించారు. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. పవన్‌ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్‌ 2న `తమ్ముడు`, `జల్సా` చిత్రాలను ప్రదర్శించారు. `జల్సా` సినిమా నాలుగు కోట్ల వసూళ్లని రాబట్టడం విశేషం.

మరోవైపు బాలయ్య సైతం తన సత్తాని చాటారు. ఆయన నటించిన చిత్రాల్లో బ్లాక్‌బస్టర్‌ `చెన్నకేశవరెడ్డి`ని కూడా ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాని దాదాపు నాలుగువందల సెంటర్లలో స్పెషల్‌గా ప్రదర్శించడం విశేషం. ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. నాగార్జున కెరీర్ ని మరో మెట్టు ఎక్కించి, తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచే చిత్రం `శివ`ని మళ్లీ రిలీజ్‌ చేయబోతున్నారు.

ఇటీవల నాగార్జున వెల్లడించారు. `శివ` సినిమాని రీ రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలిపారు. `శివ` చిత్రాన్ని రీ రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. అయితే డిజిటల్‌ రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. ఆ ప్రాసెస్‌ జరుగుతుందని, అయితే కొన్ని రీల్స్ మిస్‌ అయ్యాయని, వాటిని వెతికే పనిలో టీమ్‌ ఉన్నారని సమాచారం. `శివ` అనే కాదు, తన హిట్‌ సినిమాలు చాలా వరకు రీ రిలీజ చేయాలనే ప్లాన్‌ ఉందని చెప్పారు నాగార్జున. కాకపోతే అన్ని సినిమా రీల్స్ దొరకడం కష్టం అవుతుందన్నారు నాగ్‌.

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం `శివ`. తెలుగులో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. సౌండింగ్‌, టేకింగ్‌, మ్యూజిక్‌ పరంగా ఇదొక సంచలనాత్మక చిత్రంగా నిలిచింది. నాగ్‌ కెరీర్‌లోనే ఓ మైలు రాయిగా నిలిచింది. 1990 డిసెంబర్‌ 7న ఈ చిత్రం విడుదలైంది. ఇప్పుడు రీ రిలీజ్‌ అనేది మరి డిసెంబర్‌లోనే చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇక నాగార్జున `ది ఘోస్ట్` చిత్రంతో దసరా సందర్భంగా ఆడియెన్స్ ముందుకొచ్చారు. ప్రవీణ్‌ సత్తారు రూపొందించిన చిత్రమిది. సోనాల్‌ చౌహాన్‌ దర్శకత్వం వహించారు. ఏషియన్‌ సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పి రామ్మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: