త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా కలలు కంటూ ఉంటా డు. ఆ విధంగా ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ తదుపరి సినిమా ఎవరితో చేస్తాడా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. వాస్తవానికి మహేష్ బాబు సినిమా కంటే ముం దు రామ్ తో ఆయన ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు చాలా వచ్చాయి. కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఈ లోగానే మహేష్ బాబుతో ఆయన సినిమా చేయడానికి రెడీ అవ్వడం జరిగింది.

దాంతో ఆ సినిమా పక్కన పెట్టేసారని తెలుస్తుంది ఇటు రామ్ కూడా బోయపా టి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది. బోయపాటి శ్రీను ఏ స్థాయిలో సిని మాలను రూపొందిస్తాడు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి మాస్ దర్శకుడు తో కలిసి రామ్ చేస్తున్న సినిమాపై సహజంగానే ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. 

ఈ ఏడాది వారియర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన రామ్ ఆ సినిమాతో ప్రేక్ష కులను ఏమాత్రం అలరించలేకపోయాడు. మాస్ మసాలా ఈ సినిమా వారిని అలరించడంలో తేలిపోవడంతో ఈ సినిమా ఆయన కెరియర్లో మరొక ఫ్లాప్ గా నిలిచిపోయింది. ఇస్మార్ట్ శం కర్ సినిమా తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకోలేకపోయినా రామ్ ఇప్పుడు చేస్తున్న బోయపాటి సినిమాతోనైనా మంచి విజయాన్ని అందుకొని మళ్ళీ మంచి కం బ్యాక్ చేస్తాడా అనే ది చూడాలి. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుందని చెబుతున్నారు.  దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఊర మాస్ సినిమా గా ఇది తెరకెక్కుతుంది అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: