మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . చిరంజీవి ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు . మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇండియన్ బెస్ట్ ఫిలిం పర్సనాలిటీ 2022 అవార్డ్ ను అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ అవార్డ్ ను తాజాగా అందుకున్న చిరంజీవి ఈ అవార్డ్ ను అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ,  తనను గుర్తించి ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేసిన కేంద్రనికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు .

ఉన్నత స్థాయిలో నిలిపిన అభిమానులకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు . ప్రపంచం లోని తెలుగు సినీ అభిమానులందరికీ ప్రేమకు తాను దాసుడిని అని చిరంజీవి అన్నారు . ఇండస్ట్రీ లో టాలెంట్ ఉంటే ఎదుగుతామని , లేకుంటే ఎదగము అని చిరంజీవి స్పష్టం చేశారు . ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు .

బాబి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది . శృతి హాసన్మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు . మాస్ మహారాజ రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు . ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: