బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. కొంత కాలం క్రితం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అజయ్ దేవ్గన్ , రామ్ చరణ్ కి తండ్రి పాత్రలో నటించాడు. ఈ మూవీ లో అజయ్ దేవ్గన్ పాత్ర నిడివి తక్కువే ఆయనప్పటికీ ఈ మూవీ లో ఆయనది అత్యంత కీలక పాత్ర కావడంతో ఈ సినిమా ద్వారా అజయ్ దేవ్గన్ కి మంచి గుర్తింపు వచ్చింది.

మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ లభించింది. కొంత కాలం క్రితం ఈ నటుడు రైడ్ అనే సినిమాలో హీరో గా నటించి సూపర్ సాలిడ్ సక్సెస్ను అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కొనసాగింపుగా రైడ్ 2 అనే మూవీ ని రూపొందించారు. ఇందులో కూడా అజయ్ దేవ్గన్ హీరో గా నటించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టి సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇప్పటివరకు బుక్ మై షో ఆప్ లో ఈ సినిమాకు సంబంధించిన 2.5 మిలియన్ టికెట్లు సేల్ అయినట్టు తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే ఈ మూవీ కి బుక్ మై షో లో అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ad