
నాన్న నటించిన అన్ని సినిమాలు ఇష్టమని సితార పేర్కొన్నారు. ఈరోజు ఏఎంబీ సినిమాస్ లో సితార తన స్నేహితురాళ్లతో కలిసి ఈ సినిమా చూడనున్నారని తెలుస్తోంది. షిరిడి, తిరుమలకు వెళ్లడం అంటే నాకు ఎంతో ఇష్టమని సితార చెప్పుకొచ్చారు. సితారకు ఖలేజా అంటే ఎంత ఇష్టమో ఈ కామెంట్ల ద్వారా సులువుగా అర్థమవుతోంది. మాస్ ఏరియాల్లో సైతం ఖలేజా మూవీ అదరగొడుతోంది.
ఈరోజు ఫ్రైడే అయినప్పటికీ ఖలేజా సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఏ మాత్రం సాధారణమైన విషయం అయితే కాదు. ఏఎంబీ సినిమాస్ లో సితార సందడి చేస్తోందనే వార్త అభిమానులకు సైతం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందనే చెప్పాలి. ఖలేజా సినిమా అప్పట్లో ఫ్లాప్ కావడం వెనుక కూడ ఇతర కారణాలు అయితే ఉన్నాయి.
ఖలేజా సినిమా రీరిలీజ్ లో 10 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది. మనిషినే దేవుడిగా చూపించడం అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడానికి కారణమైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖలేజా సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కినా ఎగ్జిక్యూషన్ లో లోపాలు ఉన్నాయి. సినిమాలో హీరోయిన్ ను ఐరన్ లెగ్ గా చూపించడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. ఖలేజా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అప్పట్లో అయితే మెప్పించలేదు.