"కొత్త ఒక వింత.. పాత ఒక రోత".. ఈ సామెతను అంత ఈజీగా మర్చిపోగలమా.  ప్రతి విషయంలోనూ మన ఇంట్లోని పెద్దవాళ్ళు ఈ సామెతను ఏదో ఒక రకంగా గుర్తు చేస్తూనే ఉంటారు . మరి ముఖ్యంగా ఏదైనా కొత్త పద్ధతి వచ్చిందంటే చాలు ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి అని .. మనకి లక్ తెచ్చి పెట్టిన పద్ధతిని మర్చిపోతూ ఉంటాం . కేవలం ట్రెండ్ ఫాలో అవ్వడానికి మాత్రమే ఇలా చేస్తూ ఉంటాం. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో అది బోల్తా కూడా కొట్టించేస్తుంది.


ఫిలిమ్ ఇండస్ట్రీలో తాజాగా ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ అందరూ పాన్ ఇండియా.. పాన్ ఇండియా.. పాన్ ఇండియా అంటున్నారు.  లేకపోతే మల్టీస్టారర్ మూవీ అంటున్నారు. ఒక హీరో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ సినిమాలు చూస్ చేసుకుని హిట్ కొడితే  అదే కంటెంట్ చూస్ చేసుకుని మిగతా హీరోలు కూడా హిట్ కొట్టడానికి ట్రై చేస్తున్నారు . అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ అనే యాంగిల్ నే మర్చిపోతున్నారు స్టార్ హీరోస్.



ఒకప్పుడు బిగ్ బడా స్టార్ హీరో సినిమాలలో కొంచమైనా కామెడీ ఉండేది . కచ్చితంగా 100% మూవీలో 30% కామెడీ తో నవ్వించేవారు. అది యాక్షన్ మూవీ అయినా సరే. ఇప్పుడు పాన్ ఇండియా  పుణ్యమా అంటూ ఏ హీరో కూడా కామెడీ యాంగిల్ ను టచ్ చేయలేకపోతున్నాడు.  ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ నటించిన సినిమాలు చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమైపోతుంది.  మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్  సంపాదించుకున్న స్టార్స్ అందరూ కూడా సినిమాను ఒక స్పెషల్ ధీమ్ తో తీసుకెళ్తున్నారు .



ఒకప్పుడు చరణ్ - తారక్ - అల్లు అర్జున్ తమ సినిమాల విషయంలో కామెడీను కచ్చితంగా ఉండేలా చూసుకునే వాళ్ళు . కానీ ఈ మధ్యకాలంలో మాత్రం దాన్ని మిస్ అయిపోతున్నారు . నెమ్మది నెమ్మదిగా కామెడీ అనే పదాన్ని మర్చిపోయి పూర్తిగా బానిసలు అయిపోతున్నారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఇదే జరిగితే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బడా స్టార్స్ నుంచి కామెడీ యాంగిల్ ని ఎక్స్పెక్ట్ చేయడం ఇక మర్చిపోవాల్సిందే అంటూ కొంతమంది ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చూస్తూ ఉండడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: