గత కొన్ని సంవత్సరాలుగా మంచి కంటెంట్ ఉన్నట్లయితే చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. అలా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో కేరింత మూవీ ఒకటి. ఈ మూవీ లో సుమంత్ అశ్విన్ హీరోగా శ్రీ దివ్య హీరోయిన్ గా నటించగా ... తేజస్వి , పార్వతీశం , విశ్వంత్ ప్రధాన పాత్రలలో నటించారు. సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా 2015 వ సంవత్సరం జూన్ 12 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో పది సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి పది సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమా ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.72 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 42 లక్షలు , ఉత్తరాంధ్రలో 1.1 కోట్లు , ఈస్ట్ లో 41 లక్షలు , వెస్ట్ లో 35 లక్షలు , గుంటూరు లో 52 లక్షలు , కృష్ణ లో 29 లక్షలు , నెల్లూరు లో 17 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.99 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియాలో 52 లక్షల కలెక్షన్లు దక్కగా ... మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 5.51 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 4.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 5.51 షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ కి 1.01 కోట్ల లాభాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: