
నిన్నటి రోజున సాయంత్రం శివ మొగ్గ జిల్లాలో మణి రిజర్వాయర్ సమీపంలో షూటింగ్ జరుగుతూ ఉండగా పడవ బోల్తా పడిందనే వార్తలు వినిపించాయి. అయితే ఆ సమయంలో అక్కడ 32 మంది ఉన్నారని.. స్వల్ప గాయాల కారణం చేత కొంతమందిని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారట. ఈ విషయం పైన హోంభలే ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని.. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు.
కానీ శివమొగ్గ జిల్లా మెజిస్ట్రేట్ చిత్ర బృందం షూటింగ్ కి సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నారా? తగిన జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనే విషయం పైన తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ చిత్ర బృందం జిల్లా యంత్రాంగం నుంచి కాకుండా బెంగళూరు నుంచి మాత్రమే అనుమతులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ చిత్ర బృందానికి నోటీసులను జారీ చేసినట్లుగా తెలుస్తోంది జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ గురుదత్త.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో నటిస్తున్న ముగ్గురు నటులు కొన్ని కారణాల చేత మృతి చెందారు. మరి ఇలాంటి సమయంలో చిత్ర బృందానికి నోటీసులు రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది.