
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో మంచు మనోజ్ ఒకరు కాగా ఈ ఏడాది భైరవం సినిమాతో మనోజ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మనోజ్ ప్రస్తుతం మిరాయ్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కోలీవుడ్ మూవీ షూట్ లో స్టెంట్ మ్యాన్ రాజు మృతి గురించి మంచు మనోజ్ విచారం వ్యక్తం చేయడం గమనార్హం.
అలాంటి వాళ్ళ బాధలను తాను చాలా దగ్గరగా చూశానని మంచు మనోజ్ వెల్లడించారు. వెట్టువం మూవీ షూట్ లో స్టెంట్ లెజెండ్ ఎస్.ఎం.రాజు అలియాస్ మోహన్ రాజ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబానికి తాను మద్దతుగా ఉంటానని ఇలాంటి విషాద సమయంలో మన ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరుతున్నానంటూ మనోజ్ చెప్పుకొచ్చారు.
మోహన్ రాజ్ మరణించిన విషయం నాకు ఇప్పుడే తెలిసిందని ఆయన ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి అని మనోజ్ పేర్కొన్నారు. గాయాలు జరిగినప్పుడు ప్రాణాలు పోయినప్పుడు స్టంట్ పర్ఫార్మర్లు , వాళ్ళను ప్రేమించే వాళ్ళు ఎలాంటి బాధను అనుభవిస్తారో నేను దగ్గరిగా చూశానని మనోజ్ అన్నారు. ఒక స్టంట్ మ్యాన్ గా వారి కుటుంబానికి దగ్గరగా మన ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ నిలబడాలని కోరుతున్నానని చెప్పుకొచ్చారు.
మన ఇండస్ట్రీ ధైర్యాన్ని ఇస్తుందని కానీ ధైర్యం ఎప్పుడూ మన భద్రతను కాపాడలేదని మనోజ్ కామెంట్లు చేశారు. ప్రతి సినిమా సెట్ లో శిక్షణ, భీమా, జవాబుదారీతనం, బలమైన ప్రోటోకాల్ ను యూనియన్లు అమలు చేయాలని రాజు ప్రాణ త్యాగం మనకు మేలుకొలుపు లాంటిదని చెప్పుకొచ్చారు. మన హీరోలను, వారి కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని మనోజ్ చెప్పుకొచ్చారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు