ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షోలలో బుల్లితెరలోనే టాప్ గా నిలవడానికి కారణం యాంకర్ అనసూయ అందం,నాగబాబు రోజా జడ్జిలుగా ఉండడం,మంచి టాలెంట్ ఉన్న కమెడియన్లు ఉండడం అంటూ ఉంటారు.జడ్జిలు,కమెడియన్లు,యాంకర్ వల్లే జబర్దస్త్ టి ఆర్ పి రేటింగ్ లో టాప్ లో ఉండేది.అయితే అలాంటి జబర్దస్త్ నుండి అనసూయ బయటికి వెళ్లిపోయింది. ఇక  దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా జబర్దస్త్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన అనసూయకమెడియన్ పై షాకింగ్ కామెంట్లు చేసింది.నీ లింకుల వల్లే నేను జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయాను అంటూ మాట్లాడిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ షో స్టార్ట్ అయ్యి 12 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఆగస్టు 1న ఈ షో కి సంబంధించి మెగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు.

 అయితే ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించి ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోలో జడ్జిగా పని చేసిన నాగబాబు తో పాటు యాంకర్ అనసూయ కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక అనసూయ ఎంట్రీ ఇవ్వడంతోనే హైపర్ ఆది పై పంచులు పేల్చింది.ఇక ఇంద్రజ మాట్లాడుతూ.. అనసూయ రావడంతోనే మూలన కూర్చున్న హైపర్ ఆది ముందు వరుసలో కూర్చున్నారు అంటూ సెటైర్ వేసింది. అయితే అప్పటివరకు ఫన్నీగా సాగిన వీరి సంభాషణ ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. అందరి ముందే అనసూయ నేను యాంకర్ గానే కాకుండా ఆది తో స్కిట్ కూడా చేశాను. కానీ ఎన్నిసార్లు వద్దని చెప్పినా కూడా వినలేదు.అదేంటంటే..ఆదితో స్కిట్ చేసిన సమయంలో నాకు అస్సలు ప్రయారిటీ లేదు. పూర్తి ప్రయారిటీ కొట్టేశాడు అంటూ అనసూయ కాస్త సీరియస్ అయింది.

ఆ తర్వాత హైపర్ ఆది మాట్లాడుతూ.. నువ్వు జబర్దస్త్ వదిలి వెళ్ళినా కూడా మనకి లింకులు పంపించారు. మన లింకు బంధం అలాంటిది అంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు. ఇక హైపర్ ఆది కామెంట్లకి కోపంతో ఊగిపోయిన అనసూయ ఇదిగో ఇలాంటి మాటల వల్లే నేను జబర్దస్త్ వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేశావా అంటూ ఫైర్ అయింది. ఇక హైపర్ ఆది అనసూయల మధ్య వివాదం రాజుకున్న వీడియోని ప్రోమోలో చూపించారు. దీంతో వీరిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది.. హైపర్ ఆది వల్లే అనసూయ జబర్దస్త్ నుండి వెళ్లిపోయిందా అనేది పూర్తి ఎపిసోడ్ చూస్తే గాని తెలియదు. ఇక ఈ మెగా సెలెబ్రేషన్స్ ఎపిసోడ్ ఆగస్టు 1 న ప్రసారం కాబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: