సీనియర్ నటి బి.సరోజదేవి రీసెంట్ గానే మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇక సరోజ దేవి మరణంతో ఇండస్ట్రీ ఒక లెజెండ్రీ నటిని కోల్పోయింది అని ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అలాంటి నటి సరోజా దేవి మరణించాక హీరోయిన్ టబుతో ఉన్న ఒక సీక్రెట్ రిలేషన్ బయటపడింది.అయితే చాలామందికి డౌట్ రావచ్చు సరోజా దేవి హిందు.. టబు ముస్లిం.. వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అని.మరి వీరిద్దరి మధ్య ఎవరికీ తెలియని ఆ సీక్రెట్ రిలేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. సీనియర్ దివంగత నటి బి.సరోజా దేవికి టబు కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే వీరిద్దరూ ఆ రెండు సినిమాల్లో సేమ్ పాత్రలు పోషించారట. 

ఇక విషయంలోకి వెళ్తే.. సీనియర్ నటి సరోజా దేవి సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి   పాండురంగ మహత్యం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా తర్వాత సరోజా దేవికి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక సరోజా దేవి ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం మూవీలో వేశ్య పాత్రలో నటించింది.. పుండరీకుడి పాత్రలో ఎన్టీఆర్ నటించగా ఆయన్ని మత్తులో పడేసే వేశ్య పాత్రలో సరోజా దేవి నటించింది. అలాగే ఈ సినిమాలో ఆమె నటనని మెచ్చిన చాలామంది దర్శక నిర్మాతలు తెలుగులో వరుస అవకాశాలు ఇచ్చారు. అలా ఎంతో మంది హీరోలతో జతకట్టి దాదాపు 200 సినిమాల్లో సరోజా దేవి హీరోయిన్ గా నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా రికార్డు ఎవరి పేరున లేదు.

 కేవలం సరోజా దేవి మాత్రమే 200 సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసింది. అయితే అలాంటి సరోజా దేవికి టబుకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే.. సరోజా దేవి ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన పాండురంగ మహత్యం మూవీని ఆ తర్వాత జనరేషన్ లో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ రాఘవేంద్రరావు డైరెక్షన్లో పాండురంగడు అనే సినిమాగా చేశారు. ఇక ఈ సినిమాలో పుండరీకుడు పాత్రలో బాలకృష్ణ నటించగా ఆయన్ని మత్తులో ముంచేసే పాత్రలో టబు వేశ్యగా నటించింది.అలా సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం మూవీలో వేశ్యగా సరోజా దేవి,బాలకృష్ణ నటించిన పాండురంగడు మూవీలో వేశ్యగా టబు వీరిద్దరూ ఒకే పాత్రలో నటించారు. అలా టబు కి సరోజా దేవికి మధ్య రిలేషన్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: