
ఇప్పుడు తాజా సినిమా “ఓజి”తో మళ్లీ ఆ పాత రోజులను పవన్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మేకర్స్ స్పెషల్ మెర్చండైజ్‌ను రిలీజ్ చేయగా, దానికి వచ్చిన రెస్పాన్స్ షాకింగ్‌గా ఉంది. పెట్టిన స్టాక్ అంతా కొన్ని గంటల్లోనే సేల్ అవ్వడంతో పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది. ఇకపోతే, మెర్చండైజ్ అంటే కేవలం సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే కాకుండా, స్టార్ హీరోల మార్కెట్ స్థాయిని అంచనా వేసే ఒక సూచికగా కూడా చెప్పుకోవాలి. ఈ కోణంలో చూస్తే, “ఓజి” ఇంకా రిలీజ్ కాకముందే అభిమానుల్లో సూపర్ హైప్ క్రియేట్ చేసినట్టే.
పవన్ కళ్యాణ్ తన స్టైల్‌తోనే కాదు, తన వ్యక్తిత్వం, స్క్రీన్ ప్రెజెన్స్‌తోనూ యూత్‌ని ఇంతకీ ఆకట్టుకుంటున్నారని చెప్పాలి. మొత్తం మీద, “ఓజి” పవన్ అభిమానులకు కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక పాత జ్ఞాపకాలను మళ్లీ తెచ్చిన ఫెస్టివల్‌లా మారింది. దర్శకుడు సుజిత్ సినిమా యూనిట్ ఈ మేజిక్‌ను అందించినందుకు అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడు అందరి చూపు “ఓజి” రిలీజ్ పై పడింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు