యువ హీరో తేజ సజ్జ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాల‌లో ఒకటిగా నిలిచిన “మిరాయ్” చిత్రం సెప్టెంబర్ నెలలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. యువ‌ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, రితికా నాయక్ హీరోయిన్‌గా పరిచయం అయింది. మంచు మనోజ్ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్లో సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మిరాయ్ రిలీజ్ రోజు నుంచే అద్భుతమైన ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం, పాజిటివ్ టాక్‌తో రెండో వారంలో కూడా బలంగా రన్ అవుతోంది. ఇప్పటివరకు మొత్తం 12 రోజులు బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా రు. 140 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. తేజ సజ్జ స్థాయిలో ఉన్న యువ హీరోకి ఇది పెద్ద మైలురాయి. మిరాయ్ హిట్‌తో తేజ‌కు టాలీవుడ్‌లో బలమైన స్థానం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.


సినిమా నిర్మాణ విలువలు, విజువల్ ప్రెజెంటేషన్, కథలో ఉన్న ట్విస్ట్‌లు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్నాయి. గౌర హరి అందించిన సంగీతం, ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి అదనపు బలాన్నిచ్చాయి. అలాగే శ్రేయ శరన్, జైరాం, జగపతిబాబు వంటి సీనియర్ నటుల పాత్రలు ఈ సినిమాకు స్పెష‌ల్‌గా నిలిచాయి. “మిరాయ్” విజయంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ స్థాయిలో ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించడం తమకెంతో ఆనందం కలిగించిందని వెల్లడించారు. మొత్తానికి, తేజ సజ్జ కెరీర్‌కి “మిరాయ్” టర్నింగ్ పాయింట్ అవుతూ, 2025లో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: