పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు సినీ పరిశ్రమలో ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటించిన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఆయన నటించిన సినిమాలకు హిట్ , ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అదే ఆయన నటించిన సినిమాకు మంచి టాక్ వచ్చినట్లయితే ఆ మూవీలకు కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాల్లో చాలా సినిమాలు ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోలేదు.

కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ మూవీ తర్వాత పవన్ నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకోలేదు. తాజాగా పవన్ నటించిన ఓజి సినిమా థియేటర్లలో విడుదల అయింది. మొదటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల అయ్యాక కూడా ఈ మూవీ కి పరవాలేదు అనే టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతున్నాయి.

కానీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మాత్రం భీమ్లా నాయక్ సినిమాతో పోలిస్తే ఓజి సినిమా వెనకబడిపోయింది. విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి భీమ్లా నాయక్ సినిమాకు 13.14 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కగా , ఓజి సినిమాకు 12.26 కోట్ల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. ఇలా రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల విషయంలో భీమ్లా నాయక్ సినిమాతో పోలిస్తే ఓజి సినిమా వెనకబడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: