టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడపాదపా సినిమాలు చేస్తూనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. చివరిగా భైరవం, సుందరకాండ వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నారు. నారా రోహిత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే గత కొంతకాలంగా ప్రముఖ హీరోయిన్ సిరి లేళ్ల తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ప్రతినిధి 2 సినిమా నటిస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా గత ఏడాది అక్టోబర్ 13వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.అయితే వివాహ తేదీని మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు.


దీంతో అభిమానులు కూడా నారా రోహిత్ వివాహం ఎప్పుడు అంటూ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు. తాజాగా నారా రోహిత్ కు కాబోయే భార్య
 సిరి లేళ్ల తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక షాకింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైనట్లుగా తెలియజేసింది. దీంతో అభిమానులు ఈ ఫోటోలను తెగ లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోల విషయానికి వస్తే పసుపు దంచి పెళ్లి పనులు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది సిరి లేళ్ల. వీరి వివాహానికి పలువురు సెలబ్రిటీల తోపాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం  ఎక్కువగా ఉన్నది.



అయితే అఫీషియల్ గా మాత్రం ఇరువురు కుటుంబ సభ్యులు ఇంకా పెళ్లి డేట్ ని అనౌన్స్మెంట్ చేయలేదు.ఈ ఏడాది అక్టోబర్ చివరిలో ఉండే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది.  నారా రోహిత్ విషయానికి వస్తే 2009లో బాణం అనే సినిమా ద్వారా కెరియర్ ను మొదలు పెట్టిన నారా రోహిత్ ఆ తర్వాత సోలో, సారొచ్చారు ,ప్రతినిధి, అసుర తదితర చిత్రాలను నటించి బాగానే పేరు సంపాదించారు. నారా రోహిత్ ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు  సోదరుడైన రామ్మూర్తి నాయుడు  కుమారుడే నారా రోహిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: