నిను వీడని నీడను నేనే సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న సందీప్ కిషన్ కి ప్రస్తుతం ఆఫర్స్ వెల్లువ వచ్చింది. ఇదివరకు మాట్లాడని ప్రొడ్యూసర్లు ఇప్పుడు కాల్ చేసి మరి రమంటున్నారంట యంగ్ హీరో ని. కానీ ఇప్పడికే సందీప్ కిషన్ లైన్ గా ప్రాజెక్ట్స్ రెడీ చేసుకొని పెట్టుకున్నదంతా, తనకి నచ్చిన స్క్రిప్ట్స్ తోనే.


ఇదిలా ఉండగా, మాజీ ఇంటెర్నేషన్ ప్లేయర్ అంబటి రాయుడు, ఎవరైతే బీసీసీఐ యొక్క సవతి తల్లి ధోరణికి విసుగు చెంది, యుక్త వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాడో, ఆ క్రికెటర్ బయోపిక్ చెయ్యమని ఆఫర్స్ వస్తున్నాయి అంట.


దానిపై క్లారిటీ ఇస్తూ, "ఈ మధ్య నన్ను చాలా మంది అడిగారు, అంబటి రాయుడు బయోపిక్ లో నటిస్తారా అని, నాకు బియోపిక్స్ లో చెయ్యడం నాకు చాలా ఇష్టం, ఇలాంటి రోల్ కోసం నా లైఫ్ నే ఇస్తా, కానీ ముందు అంబటి రాయుడు ఒప్పుకోవాలి కదా" అన్నాడు.


అయితే, సందీప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన, 'తెనాలి రామకృష్ణ బబుల్' షూటింగ్ తుది దశకి చేరుకుంది అని, ఇంకో 20 డేస్ షూటింగ్ ఉందని అప్డేట్ ఇచ్చాడు. ఇదే కాకుండా, తన సూపర్ హిట్ సినిమా 'వేంకటాద్రి ఏక్సప్రెస్' కి సీక్వెల్ లో నటించడానికి కూడా సన్నాహాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: