మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు అందరికి హీరోగా,ఓ మంచి డ్యాన్సర్‌గా మాత్రమే తెలుసు కానీ అయన ఓ సినిమాకి 40 శాతం దర్శకత్వం వహించారు.చాల్లే చెప్పోచ్చారు ఆయన దర్శకత్వం వహించడమేంటి ఇప్పటివరకు మేం వినలే ఎక్కడ ఆయన పేరు దర్శకుడిగా చూడలేదని అంటారా.ఏమైన అనండి కాని ఆయన దర్శకత్వం వహించిన సినిమా అయనే నటించిన సినిమానే కావడం విశేషం.ఇకపోతే చిరంజీవి సినిమాలలో ది బిగ్గెస్ట్ మూవీగా  నిలిచినా సినిమా అది దాని పేరే గ్యాంగ్ గ్యాంగ్.....ఆ గుర్తొచ్చింది,అదే గ్యాంగ్ లీడర్ అండి.ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు చిరు స్వయంగా దర్శకత్వం వహించారట.అవేంటంటే,మురళీమోహన్‌ను హత్య చేసే సన్నివేశం,ఆయన స్నేహితులైన నారయణరావు గ్యాంగ్‌ను వెంటాడి చంపే సీన్లు అవన్నీ చిరు తీశారట.



ఈ విషయాన్నీ సీనియర్ నటుడు నారయణరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు..ఇక ఈ గ్యాంగ్ లీడర్ సినిమాకి విజయ బాపినీడు దర్శకత్వం వహించారు.అయితే ఆ సినిమా సగం పూర్తి అయ్యాక సినిమా రషెస్ ని చిరు వేసుకొని చూసారు.ఆప్పుడు అందులో కొన్ని సీన్స్ అనుకున్నంతగా రాలేదని చిరు విజయ బాపినీడుకి చెప్పడంతో విజయ బాపినీడు చిరునవ్వు నవ్వుతూ మీరు కూడా ఓ చేయి వేయండి అంటే అప్పుడు గ్యాంగ్‌ లీడర్‌' సినిమాను దాదాపు 40శాతం రీషూట్‌ చేశారట చిరంజీవి..అందుకే నారయణరావు గారు చిరు తెర మీద పేరు పడని దర్శకుడు అని ఆయనలో ఓ గ్రేట్ దర్శకుడయ్యే అవకాశాలున్న గాని అటువైపు వెళ్లకుండా నటుడిగానే తన ప్రస్ధానాన్ని సాగిస్తున్నాడని తెలిపారు.



ఇక ఆ సినిమాలో నారయణరావు ఓ పాత్రను పోషించారు.ఈ సినిమా1991లో మే 9న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించి,చిరంజీవికి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి చాలా దోహదం చేసింది.అంతే కాకుండా ఈ సినిమా 100 రోజుల ఉత్సవం చిరజీవి పుట్టినరోజునాడు  జరగడం ఒక ఎత్తైతే,తిరుపతి, హైదరాబాదు,ఏలూరు, విజయవాడలలో ఒకేరోజు శతదినోత్సవం వేడుకలు జరపడానికి ప్రత్యేక విమానాన్ని వాడటం మరో విశేషం..  



మరింత సమాచారం తెలుసుకోండి: