ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల జోరు రోజురోజుకి స్పీడ్ పెంచుతోంది. ఈ విషయంలో ప్రజల మద్దతు పొందేందుకు అటు ప్రతిపక్షాలు, ఇటు అధికార పార్టీ పోటా పోటీగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఫలితాల విషయం అటుంచితే ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేస్తూ నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ  వైసిపికి హ్యాండిచ్చి ప్రత్యర్థి పార్టీ టిడిపి అభ్యర్థితో చేయి కలిపాడు ఓ ఎంపీ. ఈ వార్త వినడానికి కొంచెం విడ్డూరంగానే ఉన్నా ఇదే నిజమని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... ఫైర్ బ్రాండ్ గా పేరొందిన అనంతపురం జిల్లా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ బాగా ఫేమస్. అందరికీ తెలిసే ఉంటారు. 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎంపీగా విజయం  సాధించారు. అయితే సొంత పార్టీని పక్కనపెట్టి టిడిపి బాధ్యతను భుజాన వేసుకున్నారట ఈ సారు. ఈయన దగ్గర బంధువు ఎంకే మధు టీడీపీ మద్దతుతో రంగంలోకి దిగారు. ఈ విషయంలో.. సొంత పార్టీ నేతలను ఒప్పించి మరీ టీడీపీ ఏకగ్రీవానికి పరోక్షంగా సహకరించారని వార్తలు వినపడుతున్నాయి. సొంత పార్టీని కాదని తన బంధువు కోసం టీడీపీకి మద్దతు పలకడం పట్ల మాధవ్ పై మండిపడుతున్నారట స్థానిక వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు.

అంతేకాదు ఈ విషయాన్ని జగనన్న దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తున్నారట. ఇదే గనుక జరిగితే  సీఎం జగన్ కు ఏం సమాధానం చెప్తారో గోరంట్ల మాధవ్ అనే చర్చ సాగుతోంది. ఒకప్పుడు సీఐగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఛాలెంజ్ చేసి మరీ కయ్యానికి కాలు దువ్వారు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ లో చేరి సంచలనం సృష్టించారు. వాక్చాతుర్యం, మంచి పనితీరు ఉన్న నాయకుడిగా పేరు పొందారు మాధవ్. ఇంత హిస్టరీ ఉన్న ఈ సారు ఇలా చేయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: