రాష్ట్రంలో ఎక్కడ చూసిన వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలోనే పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య రచ్చ గట్టిగానే జరుగుతుంది. ఎక్కడకక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దాదాపు అన్నీ జిల్లాల్లో ఈ పోరు కనబడుతోంది. ఇక స్ట్రాంగ్‌గా ఉన్న చిత్తూరు జిల్లాలో సైతం వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.

అసలు ఇక్కడ నగరి గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. నేతలు ఓపెన్‌గానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా కొందరు నేతలు రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. చక్రపాణిరెడ్డి, కేజే కుమార్, ఏలుమలై లాంటి నాయకులు రోజాకు వ్యతిరేకంగానే గళం విప్పుతున్నారు. అసలు రోజా తమ వల్లే గెలిచారని, కానీ గెలిచాక తన బంధువులకు, వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, తమని పక్కనబెట్టేశారని, అందుకే తాము సెపరేట్‌గా ఉన్నామని, నగరిలో పార్టీని కాపాడుకుంటామని మాట్లాడుతున్నారు. ఎవరెన్ని చేసిన తనని ఏమి చేయలేరని రోజా అంటున్నారు.

అలా నగరిలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఇదే క్రమంలో చిత్తూరులో ఉన్న మదనపల్లె నియోజకవర్గంలో కూడా గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. తాజాగా జగన్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో మూడు గ్రూపులు తేలాయి. ఇక్కడ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఉన్నారు...ఈయన కావాల్సిన వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళుతున్నారు. దీంతో కొందరు నేతలు అసంతృప్తికి గురై సెపరేట్‌గా రాజకీయం చేస్తున్నారు.

తాజాగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి సెపరేట్‌గా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో కలవకుండా తన వర్గంతో కలిసి వేడుకలు జరిపారు. అదే సమయంలో మరో వైసీపీ నేత మల్లెల పవన్‌కుమార్‌రెడ్డి సైతం సెపరేట్‌గా వేడుక జరిపించారు. పైగా జగన్ కటౌట్‌కు హెలిప్యాడ్ నుంచి పూలు జల్లించారు. ఇలా మదనపల్లెలో మూడు వర్గాలు తయారయ్యాయి. మరి చిత్తూరులో ఫ్యాన్ పోరు ఎప్పుడు ఆగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: