ఏపీలో రాజకీయ పరిణామాలు ఊహించని విధంగా మారుతూ...అధికార వైసీపీకి వ్యతిరేకంగా పరిస్తితులు మారుతున్నాయి. పైకి ఏదో అధికార బలం ఉన్నట్లు కనిపిస్తున్న...క్షేత్ర స్థాయిలో కాస్త సీన్ వేరుగా ఉంటుంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకంగా సీన్ మారింది. దీంతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ వెనుకబడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఉన్న నగరాల్లో వైసీపీ వెనుకబడుతుంది. ఆ మధ్య మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల్లో వైసీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. కానీ అధికార బలంతోనే వైసీపీకి ఆ విజయాలు దక్కాయని చెప్పొచ్చు.

అయితే ఇప్పుడు ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఒకసారి నగరాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్తితిని గమనిస్తే..శ్రీకాకుళం అసెంబ్లీలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చే పరిస్తితికి వచ్చింది. అలాగే విజయనగరం అసెంబ్లీలో వైసీపీని టీడీపీ డామినేట్ చేసే పరిస్తితికి వచ్చింది. ఇటు విశాఖ నగరంలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. కానీ ఇప్పుడు అక్కడ వైసీపీ పికప్ అయింది. అక్కడ ఫిఫ్టీ-ఫిఫ్టీ అన్నట్లు పరిస్తితి ఉంది.

ఇక వైసీపీ చేతిలో ఉన్న కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో..ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగే పరిస్తితి. ఇటు రాజమండ్రి సిటీ, రూరల్ సీట్లు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. అక్కడ ఇంకా టీడీపీ స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం నగరాల పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీని టీడీపీ డామినేట్ చేస్తుంది.  ఇ

క గుంటూరు నగరంలో పూర్తిగా టీడీపీదే లీడ్ అన్నట్లు ఉంది. ఒంగోలు, తిరుపతి నగరాల్లో వైసీపీ లీడ్ ఉండగా, నెల్లూరు, చిత్తూరు నగరాల్లో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇస్తుంది. అనంతపురం నగరంలో వైసీపీదే లీడింగ్. కర్నూలులో వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. ఇక కడప నగరంలో వైసీపీదే హవా ఉంది. మొత్తానికి చూసుకుంటే సిటీల్లో వైసీపీకి సీన్ రివర్స్ అవుతుందని చెప్పొచ్చు...అలాగే టీడీపీకి బాగా కలిసొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: