ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 2024 లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు చాలా ముఖ్యం అని ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చెబుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా ఒక రాష్ట్రము నుండి విడిపోయిన మరో రాష్ట్రము యొక్క అభివృద్ధి గురించి సామాన్యుడి నుండి అందరూ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఎంతవరకు చేస్తోంది అన్న విషయం పక్కన పెడితే... చేయాల్సింది ఇంకా చాలా ఉంది అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది టీడీపీ వైసీపీ లలో ఒకరే అని అంతా అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా రేస్ లో ఉందని వారికి వారే చెప్పుకుంటున్నారు. అయితే టీడీపీ తో జత కట్టి ఎన్నికలకు వెళ్లనున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కానీ, తన పార్టీ కానీ సాధించింది ఏమీ లేదు అనే చెప్పాలి. కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే జనసేన తరపున గెలిచినా, ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలకడంతో జనసేన జీరో అయింది. ఇక జనసేన అధినేత పవన్ సైతం నిలిచిన రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. అలా జనసేన కేవలం మొత్తం పోలైన ఓట్లలో 7 శాతం మాత్రమే పొందగలిగింది. కానీ పవన్ కళ్యాణ్ కానీ... తన జనసైనికులు కానీ పట్టు వదలకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియాజకవర్గంలో కార్యకర్తలను అలెర్ట్ చేస్తూ పవన్ పక్కా ప్లానింగ్ తో ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.

కాగా ప్రస్తుతం పవన్ తాను ఎమ్మెల్యే గా కావాలన్న విషయంపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. ఎప్పుడైనా నాయకుడు గెలిస్తేనే మిగిలిన వారికి మార్గనిర్దేశం చేయడానికి, వారు ఆయన మాటను అనుసరించడానికి ఒక విలువ ఉంటుంది. అందుకే జనసేన మద్దతుదారులు పవన్ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయన్న దానిపై వర్క్ అవుట్ చేస్తున్నారట. అయితే పవన్ మళ్ళీ భీమవరం నుండి పోటీ చేయొచ్చని దాదాపుగా తెలుస్తోంది. ఎందుకంటే గతం కంటే కూడా ఇప్పుడు పరిస్థితులు బాగా మారాయి. అందువలన పవన్ టార్గెట్ ప్రస్తుతానికి ఎమ్లెల్యే గా గెలువడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం పది మంది ఎమ్మెల్యేను అయినా గెలిపించాలి అన్నది టార్గెట్ గా పెట్టుకున్నారట. మరి పవన్ టార్గెట్ ను చేరుకుంటాడా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: