తెలంగాణలో బీజేపీ పార్టీ జోరు పెంచుతోంది. ప్రధాన ప్రతిపక్షం నిస్తేజంగా ఉండటంతో ఆ ప్రధాన ప్రతిపక్షం పాత్రను తాను అందుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు కాంగ్రెస్, తెలుగుదేశం నేతలను తనలో కలుపుకోవడమే కాకుండా ప్రజా సమస్యలపై కూడా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో యూరియా సమస్య బాగా ఉంది. దీనిపై ఆ పార్టీ దృష్టి సారించింది.


యూరియా సమస్యను ఆయుధంగా చేసుకుంటోంది. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ రాష్ట్రంలో యూరియా కొరత కేంద్రమంత్రి సదానంద గౌడ తో మాట్లాడారు. కేంద్రం యూరియా సరిగ్గా పంపలేదన్న టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను మంత్రికి వివరించామని లక్ష్మణ్ అంటున్నారు.


కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి అవసరానికి మించి యూరియాను కేటాయించిందని... ఖరీఫ్ కి ముందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి యూరియాని పంపిందని లక్ష్మణ్ చెబుతున్నారు. రాష్ట్రంలో యూరియాని స్టోరేజ్ చేసుకోవడానికి గోదాముల లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. రాష్ట్రంలో 7.45 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కేంద్ర మంత్రి రిపోర్ట్ ఇచ్చారని ఆయన వివరించారు.


సెప్టెంబర్ నెలకు లక్ష మెట్రిక్ టన్నుల యూరియాని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరితే కేంద్రం అదనంగా మరో లక్ష మెట్రిక్ టన్నుల యూరియాని మంజూరు చేసిందని లక్ష్మణ్ చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని... ఆయన ఎదురుదాడి చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఖాళీ అవుతోంది కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు విసిగి పోయారు...కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో కల్వకుంట్ల కుటుంబ పాలన కొనసాగుతున్నది.. తెరాస పార్టీ అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రంలో భాజపా ప్రజాపోరాటలు కొనసాగిస్తాం.. కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారని అంటున్నారు లక్ష్మణ్ .


మరింత సమాచారం తెలుసుకోండి: