మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో అనేక మార్పులు వచ్చాయి.  మార్పులు వస్తున్నాయి.  దేశ భవిష్యత్, జాతీయ భద్రత అవసరాల విషయంలో కేంద్రం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.  కేంద్ర తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీకూడా దేశాన్ని అభివృద్ధి చెందే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలే.  ఏవీ కూడా ఉపయోగపడకుండా ఉండవు.  ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడుతుంది.  


ఇక దేశంలోని ఉద్యోగుల కోసం కార్మిక చట్టాలను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే.  కార్మిక చట్టాలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.  ఒకే దేశం.. ఒకే చట్టం.. ఒకే రాజ్యాంగం.. ఒకే జెండాగా కేంద్రం అమలు చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు దేశంలో ఒకే రోజున జీతాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.  దానికి అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తున్నారు.  


ఈ విషయాన్నీ కేంద్ర కార్మిక శాఖామంత్రి గంగ్వార్ ఈరోజు మీడియాకు తెలియజేశారు.  దేశంలో వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఒకేరోజున జీతాలు అందించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.  త్వరలోనే మోడీ ప్రభుత్వం దీనికి సంబంధించిన చట్టాలను మార్చబోతున్నది. చట్టాలను మార్చేందుకు అనుగుణంగా  చర్యలు తీసుకుంటున్నట్టు గంగ్వార్ తెలిపారు. 


దేశంలోని వివిధ రంగాల్లోని వ్యక్తులు కనీస వేతనాలు ఒకే విధంగా ఉండేలా నిర్ణయం తీసుకోబోతున్నారట.  త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.  2014 నుంచి ఇప్పటి వరకు 44 కార్మిక చట్టాలను మార్చినట్టు కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  అసంఘటిత కార్మికులు, సామాజిక కూలీల కోసం మూడు వేలరూపాయల పెన్షన్ తో పాటు, వైద్యబీమా కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. త్వరలోనే మరింత భద్రతను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్టు కేంద్ర కార్మికశాఖ మంత్రి తెలిపారు.  44 చట్టాలను నాలుగు భాగాలుగా విభజించి ఒక్కోభాగంలో కొన్ని కీలక విభాగాల అంశాలను పొందుపరిచారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: