ఒకరోజు డిన్నర్ చేయాలి అంటే ఎంత ఖర్చు చేస్తారు..సామాన్యులైతే రూ. 100 నుంచి రూ. 500 వరకు పెట్టగలరు.  ఇంటిల్లపాది బయట రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసినా రెండు మూడు వేలకు మించి కాదు.  సెలెబ్రిటీలు ఫైవ్ స్టార్ హోటల్స్ లో డిన్నర్ చేసినా పెద్దగా ఖర్చు కాదు.  ఎంత పెద్ద మొత్తం అనుకున్న ఒక పూట లేదంటే ఒకరోజు డిన్నర్ చేయడానికి రూ.ఐదు నుంచి పది లక్షలు అవుతుంది.  


కానీ, జపాన్ లోని ఈయన డిన్నర్ ఖర్చు ఏకంగా రూ. 1779 కోట్లు అయ్యింది.  బాబోయ్ అని షాక్ అవ్వకండి.  ఇది నిజం.  ఈ స్థాయిలో డిన్నర్ ఖర్చు చేయడం ఏంటి అని అనుకోవచ్చు.  అయన డిన్నర్ చేసే సమయంలో డిన్నర్ కంటే దాని చుట్టూ ఏర్పాటు చేసిన విషయాలే ఎక్కువగా ఉన్నాయి.  అవేంటో చూద్దాం.  జపాన్ లో రాజుగా నారుహి సింహాసనాన్ని అధిరోహించారు.  ఈ సమయంలో ఓ డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ఇక నారుహి భార్య ఆరాధ్యదైవంగా కొలిచే సూర్యుడిని కొలిచారు.  అలానే తమ ఇలవేలు షింటోకు పూజలు చేశారు. 

ఇక, ఈ డిన్నర్ వేడుక కోసం భారీ ఖర్చుతో ఇంద్రభవనాన్ని తలపించే విధంగా ఓ దేవాలయాన్ని నిర్మించారు.  అలా నిర్మించిన ఆలయంలో 32 మంది ప్రముఖులను పిలిచి వారికీ డిన్నర్ ఇచ్చారు.  ఈ డిన్నర్ కోసం వచ్చే అథిధులు కోసం భారీ కాన్వాయ్ ను ఏర్పాటు చేసింది.  రాజుగారు ఇంద్రభవనం లాంటి ఆ దేవాలయంలో డిన్నర్ చేసే సమయంలో దేశంలోని అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.  


ఇలా దేవుడితో కలిసి భోజనం చేయడానికి ఆ రాజుగారు రూ. 1779 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో ఆదేశంలోని ప్రజలు షాక్ అవుతున్నారు.  ఇదెక్కడి విడ్డూరం అని షాక్ అవుతున్నారు.  అసలు ఇలా చెయ్యొచ్చా అని మండిపడుతున్నారు.  1800 సంవత్సరంలో ఇలాంటి వేడుకలు జరిగాయని, తరువాత ఎవరూ ఇలాంటి వేడుకలు నిర్వహించలేదని, ఇప్పుడు ఇలా చేసి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసారని చెప్పి ప్రజలు కోర్టులో కేసు దాఖలు చేశారు.  రాజుగారి డిన్నర్ ఇప్పుడు కోర్టుకెక్కింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: