ఇటీవల హైదరాబాద్ లోని తొండుపల్లి టోల్ గేట్ హై వే ప్రాంతం వద్ద ఎంతో ఘోరంగా అత్యాచారం చేయబడి, హత్య గావింపబడ్డ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై ప్రస్తుతం పార్లమెంట్ లో తీవ్ర రగడ జరుగుతోంది. దేశంలో అమాయకులైన ఆడపిల్లల మానాలకు రక్షణ లేకుండా పోతోందని, పశువులు మరియు రాక్షసుల కంటే నీచంగా కొందరు మృగాళ్లు చేస్తున్న ఈ దుశ్చర్యల వలన సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి తలెత్తిందని పలు పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేసారు. టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, ఇకపై అమ్మాయిలపై ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. 

 

ఇక కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు చేయడం మాత్రమే కాదు, సమస్య మూలాల నుండి పూర్తిగా తొలగించడానికి సమాజం నిలబడాలని అన్నారు. ఇక తమిళనాడు అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్ మాట్లాడుతూ, మనం డిజిటల్ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, కొందరు నీచులు మాత్రం మానవత్వాన్ని మర్చిపోయి ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా దారుణం అని అన్నారు. దిశా హత్య ఘటనలో నిందితులను ఘోరంగా ఉరి తీయాలని, వారు మరణించేవరకు ఉరి తీస్తేనేకాని ఇకపై ఇటువంటి నేరాలు చేయాలని భావించేవారు భయపడతారని అన్నారు. దేశంలో మహిళలు మరియు చిన్నారులకు రక్షణ లేకుండాపోయిందని, వారి రక్షణకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, 

 

ఇకనైనా భవిష్యత్తులో ఇటువంటివి జరుగకుండా చూడాలి ఆయన కోరారు. కాగా ఈ ఘటనపై పార్లమెంట్ లో పెద్ద వాడివేడి చర్చ జరుగగా, దీని పై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాల్లో ఖచ్చితంగా సమూలమైన మార్పులు రావాలని, అలానే ప్రజల్లో కూడా ఆడవారి పట్ల గౌరవం మర్యాద పెరగాలని అన్నారు. మన జన్మకు కారకురాలైన స్త్రీ రక్షణకు మనమే బాద్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఇక ఈ ఘటనపై ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ప్రజా మరియు మహిళా సంఘాలు నల్ల రిబ్బన్ లతో నిరసన చేపట్టి నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: