నేడు కేంద్ర బడ్జెట్ ను దేశ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది ఆమె ప్రవేశపెట్టిన రెండవ యూనియన్ బడ్జెట్ కావడం గమనార్హం. అయితే ఒక్క విషయం మాత్రం ఆమె చెప్పిన పాలసీలు మరియు స్కీములు అన్నింటిలోకి కొంచెం అతిశయోక్తి అనిపించింది.

 

దేశంలో కొత్తగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్నారు. చిన్న నగరాలకు కూడా విమాన సేవలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు.

 

దేశంలో 1000 కొత్త ఆకాశ మార్గాలకు అంకురార్పణ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ప్రధానంగా చిన్న నగరాలు, పట్టణాలకు విమాన సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ సేవలను అద్దెకు అందించే వ్యాపారాన్ని సరళతరం చేసే యోచనలో మోదీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది

 

 

మన ఆంధ్ర ప్రదేశ్ నే గమనిస్తే.. కడప, రాజమండ్రి, తిరుపతి లాంటి అభివృద్ధి చెందిన వాటికే విమానాశ్రయాలు మరియు కొత్త విమానాలు దిక్కు దివానం లేకుండా ఉన్నాయి. ఇక ఇప్పుడు కేవలం నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్ పోర్టులు అంటే అది దాదాపు జరగని పనే అని చెప్పాలి.

 

 

ఉడాన్ స్కీం కింద 2022 నాటికి పూర్తయ్యేసరికి టార్గెట్ పెట్టుకున్నాము అని చెప్పిన ఆమె మరిన్ని టూరిస్ట్ స్పాట్స్ ను కొత్తగా తేజస్ రైళ్ళను కూడా కలుపుతూ కూడా పెంచుతామని చెప్పారు. అయితే రైల్వే విషయం ఏమో కానీ ఇప్పుడు కొత్తగా 100 కొత్త విమానాశ్రయాలు అభివృద్ధి అవుతాయా అన్నది మాత్రం సందేహమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: