ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిలో ప్రకటన చేసినప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీలన్నీ జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మూడు రాజధానుల  నిర్మించవద్దని అమరావతిని అభివృద్ధి చేసి అమరావతిలోని అన్ని  కార్యాలయాలు సహా పరిపాలన కూడా సాగించాలి అంటూ విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అంతేకాకుండా అమరావతి లో కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు తీవ్రస్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే అమరావతిలో రైతులు చేపడుతున్న నిరసనలు పలుమార్లు ఉగ్రరూపం కూడా దాల్చాయి. 

 


 అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా... మూడు రాజదానుల  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... విమర్శలు గుప్పిస్తున్నారు. 2019 ఎన్నికలు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ తాను ప్రజల పక్షాన పోరాడుతా అని స్పష్టం చేస్తూ అధికార పార్టీ తీరును ఎండ గడుతూనే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానిల నిర్ణయం లో భాగం అమరావతిలో చట్టసభల రాజధాని విశాఖ లో పరిపాలన రాజధాని కర్నూలులో న్యాయపరమైన రాజధాని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. 

 


 కర్నూలులో జగన్ సర్కార్ హైకోర్టును ఏర్పాటు చేస్తాం అంటే ఆ అంశానికి తాను వ్యతిరేకం కాదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ కర్నూలులో హైకోర్టు వస్తే నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు వస్తాయ... కర్నూల్ లో కి పరిశ్రమలు వస్తాయా అంటూ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి అంటూ తెలిపారు. అయితే కియా పరిశ్రమ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఒకచోట పరిశ్రమ ఏర్పడినప్పుడు అభివృద్ధి చెందాలి అని అన్నారు. అయితే రాయలసీమ లో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి భయపడతారని స్థానిక నేతలు వాటా అడుగుతారేమో అని భయంతోనే రాయలసీమ లో పెట్టుబడులు పెట్టడం లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: