కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశంలో ఇప్పటిదాకా 28 కరోనా కేసులు నమోదైయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అనుమానితులు తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈ విష‌యంలో బహుముఖ పోరుకు ప్ర‌భుత్వాలు సిద్ధ‌మ‌య్యాయి. అయితే, అవ‌గాహ‌న సైతం ఈ విష‌యంలో ముఖ్య‌మైన‌ది. తాజాగా ఈ విష‌యంలో ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు తెలిపారు. మన ఉష్ణోగ్రతలో వైరస్‌ బతికే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎవరూ భయాందోళనలు చెందవద్దని.. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని తేల్చిచెప్పారు. 

 

 

చైనాలో పుట్టుకొచ్చిన కరోనా.. ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీని తీవ్రతకు ఇప్పటిదాకా 3వేల మందికిపైగా మరణించగా, 90వేలకుపైగానే బాధితులున్నారు. అయితే, కరోనా వైరస్‌ కొత్తది కాదని, జలుబు ఇదే బ్యాక్టీరియా నుంచి వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. కరోనాలో ఆరు రకాల వైరస్‌లు ఉన్నట్లు  వెల్లడించారు. వీటిలో నాలుగు వైరస్‌లు సాధారణంగా అందరికి వచ్చిపోతుంటాయన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ మొట్టమొదటిసారిగా ఉత్పన్నమైందని వెల్ల‌డించారు. , ఇది ఎలా ఉత్పన్నమైంది, దేనిద్వారా సంక్రమించిందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

 

క‌రోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఆలస్యం చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుకు పంపించాల‌ని వైద్యనిపుణులు కోరారు. అయితే, ఈ విష‌యంలో ఆందోళ‌న వ‌ద్ద‌ని సూచించారు. ‘మనకు కరోనా ముప్పులేదు. 26-27 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే ఈ వైరస్‌ జీవించే ఆస్కారం లేదు.  మన రాష్ట్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు చేరుకుంది. మాస్కులు లేవని కంగారు పడాల్సిన అవసరం లేదు. చేతి రుమాల్‌ను మడతపెట్టి ముక్కుకు అడ్డుగా పెట్టుకుంటే సరిపోతుంది. విదేశాల నుంచి  వచ్చే వారి ద్వారానే ఈ వైరస్‌ వచ్చింది. వ్యాధిగ్రస్తులను వెంటనే విడిగా ఉంచి చికిత్స అందిస్తే..వ్యాప్తి చెందే అవకాశముండదు’. అని వారు స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఉత్త‌మం.

మరింత సమాచారం తెలుసుకోండి: