మనిషి తలరాతను బ్రహ్మ రాస్తాడని అందరి నమ్మకం.. కాని ఆ బ్రహ్మ రాతనే తిరిగి రాస్తుంది ఇప్పటి టెక్నాలజీ అని కొందరు అంటున్నారు.. మనిషి ప్రాణం తీసేవాడు యముడు.. ప్రాణం పోసే వాడు వైద్యుడు అంటారు.. ఎందుకంటే ఇప్పటి వైద్యరంగంలో వస్తున్న మార్పులు గమనిస్తే ఊహించని స్దాయిలో కనిపిస్తున్నాయి.. ఇకపోతే ప్రపంచంలో అప్పుడప్పుడు చాలా అరుదైన సర్జరీలు జరుగుతాయి.. ఇలా జరిగిన వాటిలో సక్సెస్ అయ్యేవి చాలా తక్కువగా ఉంటాయి.. అయితే ఇప్పుడు మనం చదవబోయే మ్యాటర్ ఇలాంటిదే.. అంటే ఇది ఒక అరుదైన సర్జరీగా చెప్పవచ్చూ..

 

 

అదేమంటే ఒక అమ్మాయి దేహానికి, అబ్బాయి చేతులను అమర్చి విజయాన్ని సాధించారు వైద్యులు కాని అందులో కలిగే మార్పులను చూసి ఆశ్చర్యపోయారు.. ఇక 2017లో జరిగిన ఈ చేతుల మార్పిడి ఆపరేషన్ తాలూకు వివరాలు తెలుసుకుంటే.. పూణెకు చెందిన శ్రేయ సిద్ధనగౌడర్ అనే యువతి, 2016లో బస్ యాక్సిడెంట్లో తన రెండు చేతులను పోగొట్టుకుంది. ఈ దుర్ఘటన పూణె నుంచి కర్నాటకలోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళుతుండగా జరిగింది.

 

 

బీటెక్ చదువుతున్న ఆ యువతి, ఈ ప్రమాదంలో తన రెండు చేతులూ కోల్పోవడంతో భవిష్యత్తు అంధకారంగా మారిందని కృంగిపోతున్న సమయాన చేతుల మార్పిడి ద్వారా తన పాత జీవితాన్ని తిరిగి పొందచ్చని తెలుసుకుని, తన తల్లిదండ్రులతో కలసి మరుసటి ఏడాది కొచ్చిలోని అమృతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆస్పత్రిని సంప్రదించి అక్కడి డాక్టర్లను ఆశ్రయించింది.

 

 

ఇటువంటి ఆపరేషన్లకు ప్రసిద్ధిగాంచిన ఈ హస్పిటల్ ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్‌ను ఇదివరకు విజయవంతంగా నిర్వహించింది.. ఇలాంటి హస్పిటల్‌ను ఒక మనదేశం వారే కాకుండా, ఆఫ్ఘనిస్థాన్, మలేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి కూడా అనేక మంది సందర్శిస్తుంటారట.. ఇక ఈ హస్పిటల్లో ఇలాంటి కేసులే ఇప్పటికే చాలా ఉన్నాయని తెలిసిన శ్రేయ నిరుత్సాహంతో తిరుగుపయణమైంది.

 

 

అయితే అనూహ్యంగా ఆమెకు మరుసటి రోజే ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది. శ్రేయకు కొన్ని రక్త పరీక్షలు నిర్వహించేందుకు వెంటనే రావాలనేది ఆ ఫోన్ సారాంశం. అయితే ఆసుపత్రికి చేరుకున్న శ్రేయకు.. ఎర్నాకుళమ్‌కు చెందిన సచిన్ అనే బీకామ్ విద్యార్థి బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి చేతులను దానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని డాక్టర్లు తెలిపారు.

 

 

ఆ తర్వాత 13 గంటల పాటు జరిగిన ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయింది. ఇలా పురుషుడి నుంచి మహిళకు చేతుల మార్పడి జరగడమనేది ఆసియా ఖండంలోనే తొలిసారి కావడంతో ఆపట్లో ఈ వార్త మీడియాలో ప్రసారమైంది. కాగా..డాక్టర్ల శ్రమ ఫలించడంతో ఆపరేషన్ తరువాత శ్రేయ మెల్లగా కోలుకుంది.అయితే  శ్రేయా దేహానికి సరితూగేలా అమర్చిన చేతుల్లో క్రమక్రమగా మార్పులు కనిపించసాగాయి.

 

 

ఆపరేషన్ జరగిన మొదట్లో శ్రేయ చేతులు ముదురు వర్ణంలో ఉండగా.. తాజాగా వాటి రంగు ఆమె మేని ఛాయాలోకి మారిపోయింది. ప్రస్తుతం ఇదే డాక్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 200 చేతుల మార్పిడి ఆపరేషన్ జరగ్గా..చేతి రంగులో మార్పు రావడం ఇది తొలిసారి అని వైద్యులు చెబుతున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: