ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్లో మారుతీరావు ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. పోలీసుల సమాచారం అందుకున్న అక్కడికి వెళ్లి చూసేసరికి మారుతీ రావు ఆర్య వైశ్య భవన్లో మంచంపై విగతజీవిగా కనిపించాడు. అయితే మారుతీరావు మృతదేహం వద్ద ఓ సూసైడ్ నోట్ కూడా లభించిన విషయం తెలిసిందే. ఈ సూసైడ్ నోట్లో గిరిజన నన్ను క్షమించు అమృత అమ్మ  దగ్గరకి వెళ్ళిపో  అని రాసి  ఉంది. అయితే మారుతీరావు మృతదేహం వద్ద మరేదైనా ఆధారాలు కోసం  క్లూస్ టీమ్ వెతికింది . 

 

 

 ఇక భర్త మరణవార్త విన్న భార్య గిరిజ  గుండెలు పగిలేలా విలపించింది. ఇదిలా ఉంటే తన తండ్రిని ఇక్కడ కడ చూపు చూసేందుకు కూడా భద్రతను కోరింది అమృత. కానీ అమృతను తమ ఇంటికి రానిచ్చేది లేదు అంటూ మారుతీ రావు భార్య గిరిజ  తమ్ముడు శ్రవణ్  తేల్చి చెప్పారు. కానీ అమృత మాత్రం తన తండ్రి మారుతీరావు ను కడ చూపు చూసేందుకు వెళ్లేందుకు భావిస్తున్నారట. ఒకవేళ అమృత మారుతీరావు అంత్యక్రియలకు వెళ్తే పలు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కాసేపట్లో మారుతీ రావు అంతిమ యాత్ర మొదలు కానుంది. మిర్యాలగూడ లోని హిందూ స్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ఏర్పాటు చేశారు.

 

 

 ఇక మారుతీరావు అంతిమయాత్ర కోసం అటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ మారుతీరావు అంతిమయాత్రకు మారుతి రావు కూతురు అమృత హాజరయితే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇక మారుతి రావు కు.. మారుతీ రావు తమ్ముడు శ్రవణ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక నిన్న ఆర్య వైశ్య భవన్లో మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన విషయం తెలిసిందే. పోస్టుమార్టంలో మారుతీరావు విషం తాగడం వల్లే మరణించినట్లు తేలింది .

మరింత సమాచారం తెలుసుకోండి: