ప్రపంచం మొత్తం మీద 125 దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది.  ఈ  వైరస్ వల్ల లక్షలాది మంది తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారికంగా కరోనా వైరస్ వల్ల 1.3 లక్షల మంది బాధపడుతున్నట్లు చెబుతున్నారు. అయితే నిజంగా కరోనా బాధితుల సంఖ్యను చాలా తక్కువగా చేసి చూపుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. కరోనా బాధితులు, మృతుల వాస్తవ  సంఖ్యను బయటపెడితే ప్రపంచం వణికిపోతుందన్న కారణంతోనే అసలు విషయాన్ని అన్నీ దేశాలూ  దాచిపెడుతున్నాయని అంటున్నారు.

 

మొత్తం 1.3 లక్షల రోగుల్లో సుమారు 69 వేల మందికి వైరస్ నయమైంది. మరో 57 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. వీళ్ళల్లో సుమారు 5700 మంది పరిస్ధితి ఆందోళనగా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకూ అధికారికంగా గుర్తించిన మరణాలు 4756 మంది. బహుశా ఈ సంఖ్య కూడా ఇంకా ఎక్కువగా ఉండచ్చు. అత్యధికంగా చైనాలోనే సుమారు 15 వేల మంది ఈ వైరస్ తో బాధపడుతున్నారు. ఇరాక్ లో అతి తక్కువగా ఇరాక్ లోనే 48 మందికి వైరస్ సోకింది.

 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఏ స్ధాయిలో వణికించేస్తోందంటే చాలా దేశాలు వాణిజ్య వ్యవహారాలను నలిపేశాయి. విదేశాల నుండి వస్తున్న పర్యాటకులను కూడా రావద్దని చెప్పేస్తున్నాయి. ప్రపంచదేశాల్లో ఉన్న భారతీయులను ఆయా దేశాలు ఇండియాకు పంపేస్తున్నాయి. కరోనా దెబ్బకు చాలా దేశాల్లో  అంతర్జాతీయ క్రీడలను కూడా నిలిపేస్తున్నాయి. తొందరలో జపాన్ లో  జరగాల్సిన ఒలంపిక్స్ క్రీడల నిర్వహణ కూడా అయోమయంలో పడిందంటేనే వైరస్ దెబ్బ ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది. ఒలంపిక్స్ క్రీడలను వాయిదా వేయాలని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారంటేనే తీవ్రత అర్ధమవుతోంది.

 

ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద సుమారు 11 లక్షల కోట్లు ఒక్క గురువారమే ఆవిరైపోయిందంటేనే ప్రపంచ ఆర్ధికరంగంపైన కూడా దీని ప్రభావం అర్ధమైపోతోంది. ప్రపంచ మార్కెట్లు ఎప్పటికి కోలుకుంటాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: