నగరంలో ఎక్కడ చూసినా కరోనానే అంతా రామమయం లాగా ఇప్పుడు అంతా కరోనా మయంలా ఉంది. ఇప్పుడు ఎవరిని పలకరించిన కూడా మొదటగా వచ్చే మాట ఇదే.. పలు దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుని పాటించండి. మొదటగా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులను సబ్బుతోనైనా, హ్యాండ్‌ వాష్‌ ను ఉపయోగించాలి. కాకపోతే.. వీటిని వాడటం కంటే శానిటైజర్‌ ను వాడటం చాలా సులభం. కరోనా వైరస్ ప్రభావంతో శానిటైజర్ కు డిమాండ్‌ విపరీతంగా ఏర్పడింది. వ్యాపారులు కూడా వీటిని బ్లాక్‌ లో అమ్ముతున్నారు. ఇప్పుడు శానిటైజర్‌ దొరకని పరిస్థితి నెలకొంది. ఆన్‌ లైన్, ఆఫ్‌ లైన్, మెడికల్‌ షాప్స్‌ ఇలా ఎక్కడ కూడా నోస్టాక్‌ అంటూ చెప్పేస్తున్నారు. కాబట్టి శానిటైజర్లను సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? దానికి కావలసిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అనే వివరాలను తెలుసుకోండి.

 

శానిటైజర్‌ తయారీకి కావాల్సిన వస్తువులు: రబ్బింగ్‌ ఆల్కహాల్‌/ ఓడ్కా లిక్కర్‌, అలోవెరా జెల్‌, ఎసెన్షియల్‌ ఆయిల్‌

 

రబ్బింగ్‌ ఆల్కహాల్‌: దీనికి మరో పేరు.. ఇథేల్‌ ఆల్కహాల్, ఇథనాల్‌ అని కూడా అంటారు. అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్‌ వంటి ఆన్‌ లైన్‌ స్టోర్లలో కూడా దొరుకుతుంది. బ్రాండ్‌ను బట్టి 100 ఎంఎల్‌ రూ.100 నుంచి రెండు లీటర్‌లు, 5 లీటర్ల క్వాంటిటీలో రూ. 495 ఆపై ధరల్లో లభిస్తుంది. ఇది ఫంగస్, వైరస్‌ లకు చంపుతుంది. ఇది మెడికల్‌ షాప్స్, మెడికల్‌ ఏజెన్సీలలో, మెడికల్‌ రసాయనాలు అమ్మే షాపులలో దొరుకుతుంది. 

 

అలోవెరా జెల్‌: ఇది కూడా మెడికల్, కిరాణా, ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. లేదంటే మన ఇంటి ఆవరణలో ఉన్న అలోవెరాను కూడా వాడవచ్చు. ఇది యాంటిబయోటెక్‌గా ఉపయోగపడుతుంది.

 

ఎసెన్షియల్‌ ఆయిల్‌: ఎసెన్సియల్‌ ఆయిల్‌ ను కాస్మొటిక్స్, పర్‌ఫ్యూమ్స్, పలురకాల ఫుడ్‌ ప్రొడక్ట్‌ ల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. యాంటిబయోటెక్‌ వదిన తర్వాత కూడా ఇంకా ఏమైనా క్రిములు ఉంటె ఇది సంహరిస్తుంది. వివిధ రకాల ఫ్లేవర్లలో ఇది తక్కువ ధరకే దొరుకుతుంది. 

 

తయారీ విధానం: 100 శాతం ఆల్కహాల్‌ ఉంటే దానికి సరిపడేలా 140 ఎంల్‌ ఆల్కహాల్‌ ను తీసుకోవాలి. దీనిలో 60 ఎంల్‌ మినరల్‌ వాటర్‌ మిక్స్‌ చేయాలి. ఇందులో 100 ఎంఎల్‌ అలోవెరా జెల్‌ వేసి 8 నుంచి 15 చుక్కలు వేసి మిక్స్‌ చేయాలి. అంతా పూర్తిగా మిక్స్‌ అయిన తర్వాత 300 ఎంఎల్‌ శానిటైజర్‌ను హ్యాండ్‌ పంప్‌ బాటిల్‌లో వేసుకుని  శానిటైజర్‌గా వాడుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: