ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే సరైన నిద్ర ఏ జీవికైనా అవసరమే. ముఖ్యంగా మనుషులు రోజులో కనీసం 6-8 గంటల పాటు నిద్రించకపోతే వారి ఆరోగ్యం దారుణంగా క్షీణిస్తుంది. సరైన నిద్ర పొందకపోతే మనుషుల్లో జ్ఞాపకశక్తి మందగించడంతో పాటు, శారీరక బలం కూడా తగ్గిపోతుంది. అదే పెరుగుదల దశలో ఉన్న పిల్లలు సక్రంగా నిద్రపోకపోతే... వారిలో అనేకమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజుల్లో అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్లో చాటింగులు, మొబైల్ గేమ్స్, సినిమాలు లాంటి కార్యకలాపాలు చేస్తున్నారు పిల్లలు. ఒకవేళ మీ పిల్లలు కూడా ఇదే చేస్తుంటే వారిని మందలించాలి. నిద్రపోయే సమయంలో ఎలక్ట్రానిక్ డివైస్ లకు వారిని ఎంత వీలైతే అంత దూరంగా ఉంచండి. అలాగే వారు త్వరగా పడుకునేందుకు ఈ కింద ఇచ్చిన ఆహార పదార్థాలను తినిపించండి.




1. పాలు



ప్రతిరోజూ పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగడం అనేది ఓ మంచి ఆరోగ్యకరమైన అలవాటు. స్టడీస్ తేల్చిన ప్రకారం... చిన్నపిల్లలు ఒక గ్లాసు పాలు తాగడం వలన వారిలో నిద్ర ముంచుకొస్తోంది.




2. అరటిపండు



రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయే అరగంట ముందు ఓ అరటి పండును మీ పిల్లలకు తినిపించండి. అరటి పండులో ఉండే మెలటోనిన్, సెరోటోనిన్ హార్మోన్లు నిద్రను ప్రేరేపిస్తాయి.




3. ఓట్స్


ఓట్స్ తరచుగా తినడం వలన గుండెజబ్బు లాంటి ప్రాణాంతక వ్యాధులు మన దరిచేరవు. అలాగే చిన్నపిల్లల నాడీ వ్యవస్థ మెరుగుపరచడంలో ఓట్స్ కీలకమైన పాత్ర వహిస్తుంది. ఓట్స్ లో మెలటోనిన్ అనే హార్మోను అధికంగా ఉండటం వలన పిల్లలు ఈ ఆహార పదార్థాలు తింటే వారు బాగా నిద్ర పోతారు.




ఇకపోతే బచ్చలకూర, అనాస పండు, ద్రాక్ష, యాపిల్ పండ్లను నిద్రపోయే అరగంట ముందు గట్టిగా నమిలి మీ పిల్లలు తింటే వారికి బాగా నిద్రపడుతుంది. ఫలితంగా వారి మేధా శక్తి పెరగడంతోపాటు, వారిలో ఉత్సాహం విపరీతంగా పెరుగుతుంది. మొదటి నుండే వారిని రాత్రి 10 లోపు నిద్ర పోయేలాగా చేసే బాధ్యత తల్లిదండ్రులైన మీరు ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: