ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతున్న విషయం తెలిసిందే.  నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకూ 43 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏకంగా 87కి చేరింది.  ఈ నేపథ్యంలో ప్రజల్లో ఒకంత భయాందోళనలు మొదలయ్యాయి.  తాజాగా సీఎం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఇప్పటికే లోకల్ గా జిల్లా యంత్రాంగమంతా సహాయ సహకారాలు కోరడం జరిగింది. 

 

కరోనా లక్షణాలు కనిపిస్తే.. కేవలం  క్వారంటైన్ లో 14 రోజుల పాటు  ఉండి వైద్యం చేయించుకుని తిరిగి రావచ్చు ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి వస్తే వారు తప్పకుండా మెడికల్ చెకప్ చేయించుకోవాలని.. అలాగే క్వారంటైన్ కి తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది. కరోనా లక్షణాలు కనిపిస్తే..  వారిపట్ల ఆప్యాయత చూపించండి.. ప్రేమ అభిమానాలు చూపించండి చేయాల్సిందల్లా ఏమీ లేదు ఫోన్ చేయడం డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తారు మందు ఇస్తారు ఇంట్లోనే ఉండి వైద్యం కూడా చేసుకోవచ్చు.  ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. మనకు వైద్య సిబ్బంది రెడీగా ఉన్నారు.  మీకు ఆరోగ్య సంబంద ఇబ్బంది ఉంటే తప్పకుండా 104 కి కాల్ చేయండి.

 

మీకు ఎవరికి బాగా లేకున్నా వెంటనే వారిని సంప్రదించండి.. వారు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటారు.. ఎవరికైనా ఆరోగ్యం విషమిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స అందేలా చేస్తారు.  మీకు ఎలాంటి మొహమాటం లేకుండా నిజాలు చెప్పండి.. మీ కుటుంబ సభ్యులను కాపాడుకోండి. దీని వల్ల పొరుగు వారికి కూడా మేలు జరుగుతుందని ఇది తప్పకుండా గుర్తు పెట్టుకోవాలని సవినయంగా కోరుతున్నానని అన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: