ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తీవ్రత ఉంది. దీని కారణంగా ఇప్పుడు భారీగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఎక్కువగా అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు నెలల కాలంలో భారత్ లో ఉద్యోగాల విషయంలో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. భారత్ సహా కొన్ని దేశాలు ఉద్యోగ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు. 

 

మన దేశంలో ఐటి రంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని అమెరికాలో యూరప్ లో గనుక కరోనా తీవ్రత ఇదే స్థాయిలో ఉంటే మాత్రం పరిస్థితులు చాలా వరకు దిగజారే ప్రమాదం ఉంటుంది అనేది ప్రపంచ దేశాల మాట. కరోనా వైరస్ తీవ్రతను తక్కువ అంచనా వేసిన దేశాలు ఆర్ధికంగా కూడా నష్టపోయాయి. అందులో భారత్ కూడా ఒకటి. కరోనా వైరస్ ని ముందు మన దేశం చాలా వరకు తక్కువ అంచనా వేసింది. 

 

కాని పరిస్థితులు రాను రాను మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న పలు ఐటి కంపెనీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటున్నాయని హైదరాబాద్ లో ప్రముఖ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను టెర్మినేట్ చేస్తున్నాయని అంటున్నారు. ప్రాజెక్ట్ లు అయిపోవడం తో ఉద్యోగులకు కాంటాక్ట్ ని కట్ చేసి తప్పించుకుంటున్నాయి అనేది ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న మాట.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: