ఎక్కడి మాయదారి రోగం వచ్చిందో తెలియదు గాని.. బంధాలను కూడా  లెక్కచేయకుండా చేస్తుంది.. అందరు ఉన్నా మనుషులను అనాధలుగా మారుస్తుంది.. మనుషుల్లో కాస్తో కూస్తో ఉన్న మానవత్వాన్ని పూర్తిగా చంపేస్తుంది.. దగ్గినా, తుమ్మినా మనిషి చావడం ఏందో.. నాటికాలంలో ఎవరైనా తుమ్మితే సత్యం అనే వారు.. కానీ ఇప్పుడు ఎవరు తుమ్మినా సత్తిమిరా అంటూ పరిగెత్తుతున్నారు.. కలికాలంలో కలిమాయ మనుషులను కలిగంజికి కూడా దిక్కులేకుండా చేస్తుంది..

 

 

ఇప్పటికే కరోనా వైరస్ మూలాన లాక్‌డౌన్ అమలు అవుతుండగా నిరుపేదలు ఆకలికి తాళలేక మరణిస్తున్న విషయం తెలిసిందే.. అదీగాక ఎవరైనా నారోగ్యంతో చనిపోతే ఆ చనిపోయిన వారి కుటుంబం దిక్కులేని అనాధల్లా అంత్యక్రియలు నిర్వహించ వలసి వస్తుంది.. ఇలా ఈ కరోనా సమయంలో మరణించిన ప్రతివారి దుస్దితి ఇదే.. అదీగాక కుటుంబ సభ్యులు, బంధువులు చనిపోయినా అటువైపుగా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక ఒక మహిళ తన భర్త అనారోగ్యంతో మరణించగా ఆ మృతదేహాన్ని తీసుకొని సొంత ఊరికి వస్తే బంధువులు రానివ్వలేదు. అంత్యక్రియలకు ఒప్పుకోలేదు. దీంతో పాపం ఆ భార్య తన పసిపిల్లాన్ని పట్టుకుని రాత్రంతా రోడ్డుపై మృతదేహాంతో జాగారం చేసింది.. మనుషుల్లో పూర్తిగా మానవత్వం నశించిందనడానికి నిదర్శనమే ఈ ఘటన.. ఆ వివరాలు చూస్తే..

 

 

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి లంకకు చెందిన కారుమూరి వెంకటేశ్వరరావు సొంత ఊరిని వదిలి ఉపాధిలో భాగంగా.. పెనమలూరు మండలం పెదపులిపాకలో డ్రైవర్‌గా పనిచేస్తూ, అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కాగా కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడు. ఈ క్రమంలో అతని మృతదేహన్ని తీసుకుని తన సొంత గ్రామానికి వెళ్లగా.. కరోనా భయంతో బంధువులు మృతదేహాన్ని కిందకు దించేందుకు ముందుకు రాలేదు. చివరికి అంబులెన్స్ సిబ్బంది అతడి డెడ్‌బాడీని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు.

 

 

ఏంచేయాలో దిక్కుతోచక అతడి భార్య, తన కుమారుడితో రాత్రంతా ఒంటరిగానే గడిపింది.. ఇక ఉదయం స్థానికులు ఊర్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకరించలేదు. ఈలోపల విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, డెడ్‌బాడీని మళ్లీ పెద్ద పులిపాక తరలించారు... చూశారుగా బ్రతికిన వాడికున్న విలువ మరణించిన వారికి లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: