ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఏపీలో ఈరోజు 80 కరోనా కేసులు నమోదు కాగా తెలంగాణలో 27 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 25 మంది కరోనా భారీన పడి మృతి చెందగా ఏపీ 27 మంది మరణించారు. ఏపీలో 893, తెలంగాణలో 970 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్, సూర్యాపేట ప్రాంతాల్లో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. 
 
ఏపీలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాలపై కరోనా పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ఆరు ప్రాంతాల్లో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అధికారులు ఈ ప్రాంతాలలో చర్యలు చేపడుతున్నా కరోనా కట్టడి కావడం లేదు. ఇలాంటి తరుణంలో కేసీఆర్, జగన్ తక్షణమే కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై దృష్టి పెట్టి కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో తగ్గాల్సిన దశలో కేసులు పెరుగుతూ ఉండటంతో జగన్, కేసీఆర్ హాట్ స్పాట్ ప్రాంతాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో 10,000 చొప్పున ర్యాండమ్ గా కరోనా పరీక్షలు చేయాలి. క్వారంటైన్ లో ఉన్నవాళ్లకు, రెడ్ జోన్ లో ఉన్నవాళ్లకు ర్యాండమ్ గా కరోనా పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే కరోనా సోకినా కొంతమందిలో నాలుగు వారాల వరకు వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. 
 
కొంతమందికి మొదట కరోనా నెగిటివ్ నిర్ధారణ అయినా కొన్ని రోజుల తరువాత పాజిటివ్ రావడం జరుగుతోంది. ఒక్కో ప్రాంతంలో 10,000 పరీక్షలు చేయడం ద్వారా ఆ జిల్లాలో కరోనా పరిస్థితి గురించి ఒక అంచనాకు రావచ్చు. కేసులు ఎక్కువ నమోదైనా... తక్కువ నమోదైనా కేసుల సంఖ్యను బట్టి కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపట్టవచ్చు. మరి ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తారో లేదో చూడాల్సి ఉంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: