దేశంలో కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ముఖ్యంగా పేద ప్రజలకు ఈ కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  మార్చి 24 నుంచి లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి రవాణా వ్యవస్థ స్థంభించి పోవడంతో ఇతర ప్రదేశాలకు కూలీ కోసం వెళ్లిన వారి పరిస్థితి దుర్భరంగా మారింది.  ఈ నేపథ్యంలో వలస కూలీలకు తమ స్వస్థలానికి చేరుకునే వెసులు బాటు కేంద్రం కల్పించింది.  దాంతో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. వారికోసం రైల్, బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వాలు.  అయితే ఇతర రాష్ట్రాల నుంచి తమ స్వస్థలం చేరుకున్నా కూడా వలస కూలీలకు మనశ్శాంతి లేకుండా పోతుంది. స్వస్థలానికి చేరుకున్న తర్వాత క్వారంటైన్ లో ఉండే పరిస్థితి నెలకొంది.

 

 ఆరోగ్యంగా ఉంటే పరవాలేదు.. కానీ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వీరిని క్వారంటైన్ లో ఉంచుతున్నారు.  తాజాగా యూపీకి చేరుకున్న వారిలో ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌కు కొందరు కూలీలు చేరుకున్నారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఏడుగురికి నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం యూపీలోని బస్తి జిల్లాకు కొందరు కూలీలు చేరుకున్నారు. వారిని ఓ కాలేజీలో క్వారంటైన్‌లో ఉంచారు. అందులో ఏడుగురికి కరోనా పాజిటీవ్ అని తేలింది.

 

దాంతో వెంటనే వారిని ఈ రోజు స్థానిక కరోనా ఆసుపత్రికి తరలించారు. క్వారంటైన్ కేంద్రాన్ని పూర్తిగా శుభ్రపరిచారు. ఆ ఏడుగురిని ఇటీవల కలిసిన వారిని కూడా ట్రేస్ చేసిన అధికారులు వారిని కూడా ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. కాగా, ఈ కూలీలు మహరాష్ట్రలో పనికోసం వెళ్లినవారు.  కరోనా మొదలైనప్పటి నుంచి మహరాష్ట్రాలో కరాల నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కూలీలను సొంత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: